Share News

‘పేస్‌’ దళం కాపాడేనా?

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:32 AM

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీ‌స్‌ను ఖాతాలో వేసుకున్న టీమిండియా.. తాజాగా వన్డేలపై దృష్టి సారించింది. బుధవారం నుంచి ఆతిథ్య కివీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌ జరుగనుంది.

‘పేస్‌’ దళం కాపాడేనా?
Mitchell Santner, Shubman Gill

  • అనుభవలేమి బౌలింగ్‌తో టీమిండియా

  • విరాట్‌, రోహిత్‌పై దృష్టి

  • న్యూజిలాండ్‌తో నేడు తొలి వన్డే

  • ఉదయం 7.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో...

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీ‌స్‌ను ఖాతాలో వేసుకున్న టీమిండియా.. తాజాగా వన్డేలపై దృష్టి సారించింది. బుధవారం నుంచి ఆతిథ్య కివీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌ జరుగనుంది. వచ్చే ఏడాది ఇదే ఫార్మాట్‌లో వరల్డ్‌కప్‌ జరుగనున్న నేపథ్యంలో తమ బలాబలాలను సరిచేసుకునేందుకు ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లు ఉపయోగపడనున్నాయి. అంతేకాకుండా ఈ సిరీస్‌కు వెటరన్‌ స్టార్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. మరోవైపు జట్టు బ్యాటింగ్‌ పవర్‌కు ఢోకా లేకపోయినా.. పేస్‌దళం అనుభవలే మి ప్రత్యర్థి జట్టుకు బలంగా మారే వీలుంది. స్టార్‌ పేసర్‌ బుమ్రాకు టెస్టుల కోసం విశ్రాంతినివ్వగా.. హార్దిక్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, హర్షిత్‌ రాణా గాయాలతో దూరమయ్యారు. దీంతో సిరాజ్‌పైనే అధిక భారం పడనుంది. జట్టులో ఉన్న ఇతర పేసర్లు అర్ష్‌దీప్‌, గుర్నూర్‌ బ్రార్‌, అన్షుల్‌ కాంబోజ్‌, అకీబ్‌ నబీ. వీరందరికీ కలిసి 29 వన్డేలు మాత్రమే ఆడి న అనుభవం ఉంది. మరోవైపు టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని కెప్టెన్‌ గిల్‌ ఆఖరి రెండు వన్డేలకు దూరం కానున్నాడు.


కుల్దీప్‌ కష్టమే..!

ఓపెనర్లుగా రోహిత్‌, గిల్‌ ఆ తర్వాత విరాట్‌, శ్రేయాస్‌, రాహుల్‌ బరిలోకి దిగడం ఖాయమే. ఆఫ్‌ స్పిన్‌తో పాటు హిట్టింగ్‌ చేయగల నమన్‌ ధిర్‌ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. నితీశ్‌, అక్షర్‌ల ఏడు, ఎనిమిది స్థానాలు అవసరాన్ని బట్టి మారతాయి. ఈడెన్‌ పార్క్‌లో స్ట్రెయిట్‌ బౌండరీలు కేవలం 55 మీ. దూరంలోనే ఉంటాయి కాబట్టి జట్టుకు సిరాజ్‌, అర్ష్‌దీప్‌తో పాటు పొడగరి గుర్నూర్‌ బ్రార్‌ రూపంలో ముగ్గురు పేసర్లు అవసరమే. ఇక ప్రస్తుత జట్టులో అత్యధిక వన్డే వికెట్లు (201) తీసిన బౌలర్‌గా ఉన్న స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఈ పర్యటనలో బెంచీకే పరిమితమయ్యాడు. అయితే మైదానం పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని అతడికి ఈ తొలి వన్డేలో చోటు కష్టంగానే ఉంది. దీంతో ముగ్గురు ఆల్‌రౌండర్ల (నమన్‌, నితీశ్‌, అక్షర్‌)తోనే ముందుకు వెళ్లవచ్చు.


జోష్‌లో కివీస్‌: టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లను గెలుచుకున్న కివీస్‌ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. దాదాపు పొట్టి ఫార్మాట్‌లో ఆడిన జట్టే ఇందులోనూ కొనసాగనుంది. పైగా ఈ ఏడాది ఆరంభంలో భారత గడ్డపై 2-1తో వన్డే సిరీస్‌ గెలిచి కాస్త పైచేయిలో ఉంది. ఫీల్డింగ్‌ డ్రిల్స్‌లో భాగంగా మ్యాట్‌ హెన్రీ, డెవాన్‌ కాన్వే ఢీకొన్నారు. దీంతో కంకషన్‌కు గురైన కాన్వే తొలి వన్డేకు దూరమయ్యాడు. హెన్రీ ఆడేది కూడా సందేహమే. చాప్‌మన్‌, రచిన్‌ ఈ సిరీ్‌సలో లేకపోవడంతో ఓపెనర్‌గా టిమ్‌ సైఫర్ట్‌ను ఆడించే అవకాశం ఉంది. ఫిలిప్స్‌ తన భీకర ఫామ్‌ను ఈ ఫార్మాట్‌లోనూ కొనసాగిస్తే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు.


తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, నమన్‌/కుల్దీప్‌, నితీశ్‌కుమార్‌, అక్షర్‌ పటేల్‌, సిరాజ్‌, గుర్నూర్‌ బ్రార్‌, అర్ష్‌దీప్‌.

న్యూజిలాండ్‌: సైఫర్ట్‌, విల్‌ యంగ్‌, మిచెల్‌, లాథమ్‌, ఫిలిప్స్‌, బ్రేస్‌వెల్‌, శాంట్నర్‌ (కెప్టెన్‌), స్మిత్‌, జేమిసన్‌, డఫీ, హెన్రీ/టిక్నెర్‌.

పిచ్‌, వాతావరణం

ఈడెన్‌ పార్క్‌లో మరోసారి పరుగుల వరద ఖాయమే. ఇదే మైదానంలో జరిగిన నాలుగో టీ20లో కివీస్‌ 259 రన్స్‌ బాదింది. ఇక్కడ జరిగిన చివరి నాలుగు వన్డేల్లో మూడు మ్యాచ్‌లు మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి. సగటు తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 286 కావడం విశేషం. ఉదయం వర్షం కురిసినా మ్యాచ్‌ సమయానికి ఎలాంటి ఆటంకం ఉండదు.


ఇవి కూడా చదవండి:

విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం.. మేయర్‌గా ముక్కా శ్రావణి గెలుపు..

ఇక హర్దీప్ సింగ్ పురి ఎన్నిక ఏకగ్రీవమే!

ఇజ్రాయెల్‌కు ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తాము: ట్రంప్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 01:54 AM