Share News

విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం.. మేయర్‌గా ముక్కా శ్రావణి గెలుపు..

ABN , Publish Date - Nov 03 , 2026 | 09:45 PM

విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ముక్కా శ్రావణి.. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వరుదు కల్యాణిపై గెలుపొందారు.

విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం.. మేయర్‌గా ముక్కా శ్రావణి గెలుపు..
Mukka Sravani

విశాఖ, నవంబర్ 3 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ముక్కా శ్రావణి.. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వరుదు కల్యాణిపై గెలుపొందారు. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన విశాఖలో మొత్తం 120 డివిజన్లు ఉండగా.. అత్యధిక స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.


ఈ సందర్భంగా ముక్కా శ్రావణి మాట్లాడుతూ.. విశాఖ నగరం తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో కంచుకోటగా ఉందన్నారు. తనపై, కూటమి అభ్యర్థులపై విశ్వాసం ఉంచి గెలిపించిన నగర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. ఈ ఎన్నికల్లో రెండున్నర లక్షల మెజార్టీ లభించిందని ఆమె పేర్కొన్నారు. ఈ విజయంతో సంతోషం కలిగినప్పటికీ, ప్రజల పట్ల బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. నగర ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలు, నమ్మకాలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. విశాఖను అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ముక్కా శ్రావణి వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

స్కూల్ బస్సులో షార్ట్ సర్క్యూట్.. 20 మంది విద్యార్థులకు తప్పిన ప్రమాదం

స్థానిక ఎన్నికలు.. జగన్‌‌కు ఎంపీ చింతకాయల విజయ్ స్ట్రాంగ్ కౌంటర్

Updated Date - Nov 03 , 2026 | 09:51 PM