స్కూల్ బస్సులో షార్ట్ సర్క్యూట్.. 20 మంది విద్యార్థులకు తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Nov 03 , 2026 | 09:02 PM
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. పాఠశాల నుంచి దేవరపల్లికి విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సులో ప్రమాదం చోటుచేసుకుంది.
తూ.గో. జిల్లా: దేవరపల్లిలో ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. పాఠశాల నుంచి దేవరపల్లికి విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సులో ప్రమాదం చోటుచేసుకుంది. రన్నింగ్లో ఉన్న బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే వాహనాన్ని నిలిపివేయగా.. స్థానికులు పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. 20 మంది విద్యార్థులను బస్సు నుంచి కిందికి దించారు. వారందరినీ సురక్షితంగా రక్షించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్టు
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా హర్షం