ఇరాన్‌పై దాడిచేసే ఆలోచన లేదు.. ట్రంప్ వెల్లడి
ABN , Publish Date - Nov 04 , 2026 | 07:24 AM
ఇరాన్‌పై దాడిచేసే ఆలోచన తమకు లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మధ్యంతర ఎన్నికల అనంతరం ఇరాన్‌తో ఉద్రిక్తతలను మరింత పెంచేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై దాడిచేసే ఆలోచన తమకు లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మధ్యంతర ఎన్నికల అనంతరం ఇరాన్‌తో ఉద్రిక్తతలను మరింత పెంచేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. అవసరమైతేనే మరోసారి సైనిక చర్యకు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్‌తో ప్రస్తుత పరిస్థితి అమెరికాకు అనుకూలంగా ఉందన్నారు. తాము కోరుకున్నది ప్రతిఒక్కటీ లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఈవారంలో ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అవసరమైతే అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని, అయితే దాడి చేయాల్సిన అవసరం రాకపోవచ్చని ట్రంప్ తెలిపారు.
కాగా.. ఇటీవల హోర్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంపై అమెరికా వైమానిక దాడులు చేసింది. అమెరికా సైనిక ఆస్తుల రక్షణ కోసమే ఈ చర్య తీసుకున్నట్లు వాషింగ్టన్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత అమెరికాలో ఇంధన ధరలు గణనీయంగా తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ యుద్ధాలతో పోలిస్తే ఇరాన్‌తో ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయి యుద్ధంగా తాను పరిగణించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. ఇరాన్లో తమ లక్ష్యం ఇంకా పూర్తికాలేదని, అక్కడ ఇంకా రెండు టార్గెట్లు ఉన్నాయని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాము అనుకుంటే పది నిమిషాల్లో ఆ పనిని ముగించి వేయగలమని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రూ.2,320 కోట్లతో తెలంగాణ ప్లాంట్ విస్తరణ
రిలయన్స్ జోరు.. 7 వారాల గరిష్ఠానికి సెన్సెక్స్