Share News

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి, 31మంది మృతి

ABN , Publish Date - Nov 04 , 2026 | 05:03 AM

ఉక్రెయిన్‌వ్యాప్తంగా రష్యా దళాలు ఒకేసారి భీకర దాడులతో విరుచుకుపడ్డాయి.

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి, 31మంది మృతి
attacks

కీవ్‌, నవంబరు 3: ఉక్రెయిన్‌వ్యాప్తంగా రష్యా దళాలు ఒకేసారి భీకర దాడులతో విరుచుకుపడ్డాయి. దేశంలోని 9 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రాత్రికి రాత్రే భారీ క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించడంతో ఉక్రెయిన్‌ అల్లాడిపోయింది. దక్షిణ ఉక్రెయిన్‌లో జపోరిజియా ప్రాంతంలో మానవతా సాయం పొందుతున్న స్థావరంపై.. ఏకంగా 1.5టన్నుల పేలుడు పదార్థాలు కలిగిన బంకర్‌ బస్టింగ్‌ బాంబులను రష్యా ప్రయోగించింది. ఈ ఘోర దాడిలో మరణించిన వారి సంఖ్య మంగళవారం నాటికి 31కి చేరింది. శిథిలాల కింద డజన్ల కొద్ది పౌరులు చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుళ్ల ధాటికి ఉక్రెయిన్‌ దేశవ్యాప్తంగా పలు విద్యుత్‌ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. రష్యా ఒకే రాత్రి 289 అటాక్‌ డ్రోన్లు, 17 బాలిస్టిక్‌ మిస్సైళ్లు, 59 క్రూయిజ్‌ క్షిపణులను ఏకకాలంలో 9 ప్రాంతాల్లో ప్రయోగించిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు.

Updated Date - Nov 04 , 2026 | 05:06 AM