Share News

రూ.2,320 కోట్లతో తెలంగాణ ప్లాంట్‌ విస్తరణ

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:18 AM

అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ అనుబంధ సంస్థ అమర రాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ పెద్దఎత్తున తన బ్యాటరీల తయారీ....

రూ.2,320 కోట్లతో తెలంగాణ ప్లాంట్‌ విస్తరణ

కొత్తగా ఎల్‌ఎఫ్‌పీ ప్లాంట్‌ ఏర్పాటు.. అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ అనుబంధ సంస్థ అమర రాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ పెద్దఎత్తున తన బ్యాటరీల తయారీ సామర్థ్యాన్ని విస్తరించనుంది. ఇందుకోసం రూ.2,320 కోట్లు ఖర్చు చేసేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ విస్తరణతో తెలంగాణలోని అమర రాజా గిగా కారిడార్‌లో ఉన్న ప్లాంట్‌ ప్రస్తుత వార్షిక బ్యాటరీల ఉత్పత్తి సామర్ధ్యం 4 గిగావాట్‌ అవర్‌ (జీడబ్ల్యూహెచ్‌) నుంచి 9 గిగావాట్‌ అవర్‌ (జీడబ్ల్యూహెచ్‌)కు పెరుగుతుంది. దీంతోపాటు కొత్తగా లిథియం ఐరన్‌ ఫాస్పేట్‌ (ఎల్‌ఎఫ్‌పీ) సెల్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ విస్తరణ కార్యకలాపాలన్నీ 30 నెలల్లో పూర్తవుతాయని కంపెనీ తెలిపింది. అలాగే ఆటోమోటివ్‌ సర్వీసుల కోసం ఏర్పాటు చేసిన అమరాన్‌ అసిస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి రూ.100 కోట్లు సమకూర్చేందుకూ బోర్డు ఆమోదం తెలిపింది.

తగ్గిన లాభం: సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.4,109 కోట్ల ఆదాయంపై రూ.153 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 18.5 శాతం పెరిగినా నికర లాభం మాత్రం 44.8 శాతం తగ్గింది. ఖర్చులు పెరిగిపోవడం ఇందుకు ప్రధాన కారణం. అయినా ఈ ఆర్థిక సంవత్సరానికి వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.4.3 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ చెల్లించాలని బోర్డు సిఫారసు చేసింది. ఈ నెల 6 నాటికి కంపెనీ రికార్డుల్లో పేరు ఉన్న ప్రతి వాటాదారుకి ఈ డివిడెండ్‌ లభిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి రుణాలకు భలే గిరాకీ

అక్టోబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లు

For More Business News And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 06:18 AM