Share News

అక్టోబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లు

ABN , Publish Date - Nov 02 , 2026 | 06:01 AM

పండగల సీజన్‌ కొనుగోళ్లు అక్టోబరు నెలలో జీఎస్‌టీ వసూళ్లను మరింతగా పెంచాయి. గత నెల మొత్తం మీద ఈ పద్దు కింద రూ.2.31 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి...

అక్టోబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: పండగల సీజన్‌ కొనుగోళ్లు అక్టోబరు నెలలో జీఎస్‌టీ వసూళ్లను మరింతగా పెంచాయి. గత నెల మొత్తం మీద ఈ పద్దు కింద రూ.2.31 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ఇందులో దేశీయ వస్తు, సేవల అమ్మకాల ద్వారా రూ.1.59 లక్షల కోట్లు, దిగుమతుల జీఎ్‌సటీ ద్వారా రూ.72,246 కోట్లు సమకూరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అక్టోబరులో జీఎస్‌టీ వసూళ్లు 22.9ు పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో వసూలైన రూ.2.43 లక్షల కోట్ల తర్వాత జీఎస్‌టీ వసూళ్లు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ఈ ఆర్థిక సంవత్సరం ఒక నెలలో జీఎస్‌టీ వసూళ్లలో ఈ స్థాయి వృద్ధి రేటు కనిపించడమూ ఇదే ప్రథమం. గత నెల వసూలైన రూ.2.31 లక్షల కోట్ల జీఎస్‌టీలో రూ.42,935 కోట్లు సెంట్రల్‌ జీఎస్‌టీ ద్వారా రూ.51,340 కోట్లు రాష్ట్రాల జీఎస్‌టీ ద్వారా రూ.1.37 లక్షల కోట్లు ఐజీఎస్‌టీతో వసూలయ్యాయి. రూ.27,934 కోట్ల రిఫండ్స్‌ పోగా అక్టోబరులో నికర జీఎస్‌టీ వసూళ్లు రూ.2.03 లక్షల కోట్లుగా తేలాయి. గత ఏడాదిఇదే కాలంతో పోలిస్తే ఇది 26% ఎక్కువ.

ఏడు నెలల్లో రూ.14.77 లక్షల కోట్లు: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-అక్టోబరు మధ్య కాలంలో వసూలైన జీఎస్‌టీ మొత్తం రూ.14.77 లక్షల కోట్లకు, నికర జీఎస్‌టీ వసూళ్లు రూ.12.69 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్థూల జీఎస్‌టీ వసూళ్లు 13.2 శాతం, నికర వసూళ్లు 13 శాతం పెరిగాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి రూ.10,265 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అక్టోబరులో రూ.10,265 కోట్ల జీఎస్‌టీ వసూలైంది. ఇందులో తెలంగాణ నుంచి రూ5,958 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి రూ.4,307 కోట్లు వసూలయ్యాయి. తెలంగాణ జీఎస్‌టీ వసూళ్లలో 14% ఏపీ జీఎస్‌టీ వసూళ్లలో 24 ు వృద్ధి రేటు నమోదైంది.

ఈ వార్తలనూ చదవండి:

జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు..

స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర..

Updated Date - Nov 02 , 2026 | 06:01 AM