జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు..
ABN , Publish Date - Nov 01 , 2026 | 02:34 PM
అక్టోబర్ నెలలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈసారి ఏకంగా 22.9 శాతం వృద్ధి నమోదైంది. దీంతో మొత్తం స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అక్టోబర్ నెలలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈసారి ఏకంగా 22.9 శాతం వృద్ధి నమోదైంది. దీంతో మొత్తం స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దేశీయ అమ్మకాలు, దిగుమతుల ద్వారా వచ్చిన పన్ను ఆదాయం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచాయి. ఆదివారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి (GST Collections October 2026).
అక్టోబర్ నెలలో దేశీయ అమ్మకాల ద్వారా వచ్చిన జీఎస్టీ ఆదాయం 15.8 శాతం పెరిగి రూ.1.59 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ మొత్తం సుమారు రూ.1.37 లక్షల కోట్లుగా ఉంది. మరోవైపు దిగుమతులపై విధించే జీఎస్టీ ఆదాయం మరింత భారీగా పెరిగింది. గత ఏడాది అక్టోబర్‌లో రూ.50,796 కోట్లుగా ఉన్న ఈ ఆదాయం.. ఈసారి 42.2 శాతం వృద్ధితో రూ.72,246 కోట్లకు చేరుకుంది. దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం జీఎస్టీ వసూళ్ల పెరుగుదలలో కీలక పాత్ర పోషించింది (GST Revenue India).
ప్రభుత్వం చెల్లించిన పన్ను వాపసులను మినహాయించిన తర్వాత కూడా జీఎస్టీ ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదైంది (October GST Collection). అక్టోబర్‌లో నికర జీఎస్టీ వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే 25.6 శాతం పెరిగి రూ.2.03 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అక్టోబర్ నెలలో మొత్తం జీఎస్టీ రీఫండ్లు 6.5 శాతం పెరిగి రూ.27,934 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో ఈ మొత్తం రూ.26,225 కోట్లుగా ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తొలి ఏడు నెలల్లోనూ జీఎస్టీ వసూళ్లు మంచి వృద్ధిని నమోదు చేశాయి. ఈ ఏడు నెలల కాలంలో స్థూల జీఎస్టీ వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే 13.2 శాతం పెరిగి రూ.14.77 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!