ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై గగనతల దాడి
ABN , Publish Date - Nov 04 , 2026 | 04:58 AM
ఒమన్ తీరంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న కార్గో నౌకపై గగతలం నుంచి దాడి జరిగింది.
భారతీయ నావికుడి మృతి.. మరో 13 మంది సురక్షితం
న్యూఢిల్లీ, నవంబరు 3: ఒమన్ తీరంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న కార్గో నౌకపై గగతలం నుంచి దాడి జరిగింది. ఈ ఘటనలో ఓ భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 13 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన నవంబరు 2న చోటుచేసుకున్నట్లు నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ మంగళవారం వెల్లడించారు. 14 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ‘అల్ జుసుఫీ’ అనే మోటార్ సెయిలింగ్ వెసెల్‌పై ఒమన్ తీరానికి సమీపంలో గుర్తుతెలియని వైమానిక పరికరం దాడి చేసినట్లు ఆయన తెలిపారు. మృతుడిని గుజరాత్‌కు చెందిన గంధర్ నహిమ్ అజీజ్‌గా గుర్తించారు.