Share News

ఇరాన్‌పై మళ్లీ దాడులు

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:53 AM

అమెరికాలో మిడ్‌టర్మ్‌ ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఆ దేశం ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసింది.

ఇరాన్‌పై మళ్లీ దాడులు
attacks

  • ఖెష్మ్‌ ద్వీపంపై సోమవారం రాత్రి బాంబులేసిన అమెరికా

  • ఒక్కరోజులోనే 1.6 డాలర్లు పెరిగిన ముడి చమురు ధరలు

వాషింగ్టన్‌, నవంబరు 3: అమెరికాలో మిడ్‌టర్మ్‌ ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఆ దేశం ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసింది. హోర్ముజ్‌ జలసంధి సమీపంలోని వ్యూహాత్మక ఖెష్మ్‌ ద్వీపంపై అమెరికా యుద్ధ విమానాలు సోమవారం బాంబుదాడులు నిర్వహించాయి. ఇరాన్‌పై దాడులకు ముందు ప్రతిసారీ దాడులు చేయబోతున్నామని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజా బాంబు దాడుల గురించి ఏమీ చెప్పలేదు. అమెరికాలో మంగళవారం మిడ్‌టర్మ్‌ ఎన్నికలు జరిగాయి. పోలింగ్‌ ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఖెష్మ్‌ ద్వీపంపై అమెరికా యుద్ధ విమానాలు దాడులు చేసినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వార్తా సంస్థ తెలిపింది. ఈ ద్వీపంలో ఇరాన్‌ భూగర్భ క్షిపణి కేంద్రాలు, నేవల్‌ బేస్‌తోపాటు సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే డీసాలినేషన్‌ భారీ ప్లాంటు ఉంది. అమెరికా దాడుల నేపథ్యంలో మంగళ వారం చమురు ధ రలు మరింత పెరిగాయి. యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియేట్‌ ముడి చమురు బ్యారెల్‌ ధర 1.6 డాలర్లు పెరిగి 98.06 డాలర్లకు చేరింది. బ్రెంట్‌ ముడి చమురు ధర 1.84 డాలర్లు పెరిగి 106.61 డాలర్లకు చేరింది. ఇరాన్‌-అమెరికా మధ్య చర్చలు కొలిక్కి వస్తున్నాయన్న వార్తలతో సోమవారం 7 శాతం దిగివచ్చిన ధరలు.. ఒక్కరోజులోనే మళ్లీ పెరిగాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

రూ.2,320 కోట్లతో తెలంగాణ ప్లాంట్‌ విస్తరణ

రిలయన్స్‌ జోరు.. 7 వారాల గరిష్ఠానికి సెన్సెక్స్‌

Updated Date - Nov 04 , 2026 | 04:54 AM