రిలయన్స్ జోరు.. 7 వారాల గరిష్ఠానికి సెన్సెక్స్
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:14 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాలను నమోదు చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు భారీగా...
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాలను నమోదు చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు భారీగా పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు చల్లబడటం సూచీలకు కలిసి వచ్చింది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం 1,233.25 పాయింట్ల (1.66ు) లాభంతో 75,692.78 వద్ద ముగిసి ఏడు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. సెప్టెంబరు 7 తర్వాత ఈ స్థాయిని సెన్సెక్స్ నమోదు చేయటం ఇదే తొలిసారి. నిఫ్టీ 387.70 పాయింట్లు (1.68%) లాభపడి 23,440.80 వద్ద క్లోజైంది. నిఫ్టీకిది ఐదు వారా ల గరిష్ఠ స్థాయి. మార్కెట్లో ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. బీఎస్ఈ మార్కె ట్ క్యాప్ రూ.7.92 లక్షల కోట్లు పెరిగి రూ.482.29 లక్షల కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్ 30 కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ర్టీస్ (ఆర్‌ఐఎల్) షేరు అత్యధికంగా 11.64 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర ఒక దశలో 4.46 శాతం తగ్గి 108.7 డాలర్లకు చేరుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్టోబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లు
For More Business News And Telugu News