రేషన్‌దారులకు కేవైసీ కష్టాలు..
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:38 AM
రేషన్‌దుకాణాలలో లబ్ధిదారులు కేవైసీ చేసుకోవడానికి సాంకేతిక సమస్యలు అడ్డువస్తున్నాయి.
ఐదేళ్లలోపు పిల్లలకు మొరాయిస్తున్న వెబ్‌సైట్
సాంకేతిక సమస్యలతో లబ్ధిదారుల ఆందోళన
వరంగల్: రేషన్‌దుకాణాలలో లబ్ధిదారులు కేవైసీ చేసుకోవడానికి సాంకేతిక సమస్యలు అడ్డువస్తున్నాయి. ఇప్పటి వరకు కేవైసీ చేసుకొని వారు ఈనెల 31వతేదీలోగా చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అనేక మంది రేషన్ దుకాణాలకు వెళ్లి ఆధార్‌కార్డు నెంబర్ నమోదు చేస్తే అది ఓపెన్ కావడంలేదని చెబుతున్నారు. ఆధార్ కార్డుకు సంబంధించిన వెబ్‌సైటులోనే సమస్య ఉంద ని అంటున్నారు. జిల్లా అంతటా ఇదే సమస్య ఉందని చెబుతున్నానరు. దీంతో కేవైసీ కోసం వచ్చిన వారు నిరాశతో వెనక్కి వెళ్లిపోయారు.
ఐదేళ్లలోపు పిల్లలకు..
ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలకు కేవైసీ చేయడానికి వస్తే కావడంలేదని లబ్ధిదారులు తెలిపారు. ఇలా అయితే వారి పేరిట వచ్చే రేషన్ పోతుందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 509 రేషన్ దుకాణాలలో వేలల్లో ఐదేళ్లలోపు పిల్లలుంటారు. వారి పరిస్థితి ఎంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈవిషయంపై జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్యను వివరణ కోరగా ఆందోళన అవసరంలేదన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఆ వయస్సు పిల్లలవి కేవైసీ కాకుంటే పోతాయని ఏవీ చెప్పలేదని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘ఇందిరమ్మ ఇళ్ల’తో సర్కారు కొత్త నాటకం!
Read Latest AP News And Telangana News And International News And Telugu News