ధాన్యం.. ఆల్‌టైం రికార్డు ధర
ABN , Publish Date - Jul 22 , 2026 | 10:47 AM
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చరిత్రలో ధాన్యానికి క్వింటాకు ఆల్‌టైం రికార్డు ధర నమోదైంది.
జైశ్రీరాం పాత రకం క్వింటాకు రూ.4,013
మార్కెట్ చరిత్రలో ప్రథమం
కేసముద్రం(మహబూబాబాద్): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చరిత్రలో ధాన్యానికి క్వింటాకు ఆల్‌టైం రికార్డు ధర నమోదైంది. అతిసన్న రకమైన జైశ్రీరాం పాత ధాన్యం రూ. 4,013ధర నమోదు కావడం విశేషం. ఈ మార్కెట్‌కు మంగళవారం కోమటిపల్లికి చెందిన రైతు నూనావత్ బాలాజీ గత ఏడాది సాగుచేసిన జైశ్రీరాం రకం ధాన్యాన్ని తొమ్మిది బస్తాలను విక్రయించేందుకు తీసుకువచ్చాడు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) విధానంలోని ‘ఈ-వేలం’లో ఈ ధాన్యానికి ఓ వ్యాపారి క్వింటాకు గరిష్ఠంగా రూ.4,013ధర నమోదు చేసి దక్కించుకున్నాడు.
దీంతో మార్కెట్ ఏర్పడిన నాటి నుంచి ధాన్యానికి క్వింటాకు రూ.4వేల మార్కు దాటడం తొలిసారి అని పలువురు వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇదేరకం ధాన్యం గత ఏడాది ఇదే సమయానికి రూ.3,600 నుంచి రూ. 3,700 వరకు గరిష్ఠంగా ధరలతో కొనుగోలు చేశారు. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులతో అన్ని రకాల ధాన్యం సాధారణ ధరల కంటే క్వింటాకు రూ.500 నుంచి రూ. 600లు అధికంగా ధర లు ఉన్నాయి. ఏదేమైనా సాధారణ బియ్యం ధరతో దాదాపు సమానంగా అతిసన్నరకాలైన జైశ్రీరాం ధాన్యం ధర ఉండడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి:
‘ఇందిరమ్మ ఇళ్ల’తో సర్కారు కొత్త నాటకం!
Read Latest AP News And Telangana News And International News And Telugu News