Share News

చమురు మంటలు.. భారీ నష్టాల్లో సూచీలు..

ABN , Publish Date - Jul 22 , 2026 | 10:05 AM

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర తిరిగి 90 డాలర్లు దాటింది. ప్రస్తుతం 1.2 శాతం పెరిగి 92 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.

చమురు మంటలు.. భారీ నష్టాల్లో సూచీలు..
Stock Market

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర తిరిగి 90 డాలర్లు దాటింది. ప్రస్తుతం 1.2 శాతం పెరిగి 92 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన నేపథ్యంలో ఫార్మా ఇండస్ట్రీ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.32గా ఉంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).


గత సెషన్ ముగింపు (77,470)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం వంద పాయిట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది. తిరిగి 77 వేల మార్క్ దిగువకు చేరుకుంది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 572 పాయింట్ల నష్టంతో 76,897 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 168 పాయింట్ల నష్టంతో 24,019 వద్ద కదలాడుతోంది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో టీవీఎస్ మోటార్స్, కల్యాణ్ జువెల్లర్స్, బజాజ్ ఆటో, నైకా మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). బంధన్ బ్యాంక్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, లూపిన్, ప్రీమియర్ ఎనర్జీస్, గ్లెన్‌మార్క్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 559 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 568 పాయింట్ల నష్టంతో ఉంది.


ఇవి కూడా చదవండి..

2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200%.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..


పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 22 , 2026 | 10:05 AM