వరుసగా 11వ రోజూ ఇరాన్‌పై దాడులు.. చర్చలపై ఆసక్తి లేదన్న ట్రంప్..
ABN , Publish Date - Jul 22 , 2026 | 09:09 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా సైన్యం వరుసగా 11వ రాత్రి కూడా వైమానిక దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరాటం కోసం ఇరు దేశాలు దాడులకు దిగుతున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా సైన్యం వరుసగా 11వ రాత్రి కూడా వైమానిక దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరాటం కోసం ఇరు దేశాలు దాడులకు దిగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలపై ఈ దాడులు ప్రభావం చూపుతున్నాయి (US Iran war).
ఒకవైపు పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు దౌత్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెని తాజాగా పాకిస్థాన్‌ను అధికారికంగా సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌తో సమావేశమయ్యారు. సరిహద్దు భద్రత, ద్వైపాక్షిక వాణిజ్యం, ప్రాంతీయ భద్రత, అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితులపై చర్చించారు (US strikes Iran).
అమెరికాతో కాల్పుల విరమణ గురించి కూడా ఎస్కందర్ చర్చలు జరిపినట్టు సమాచారం. మరోవైపు ఇరాన్‌తో శాంతి చర్చలపై ప్రస్తుతానికి ఆసక్తి లేదని మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా సైన్యం దాడులు చేస్తూనే ఉంది. కాగా, తాజా దాడుల్లో ఏ లక్ష్యాలను గురి చేసిందనే విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించలేదు.
ఇవి కూడా చదవండి..
2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200%.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..
పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..