ఆర్టీసీకి కాసుల పంట..
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:39 PM
రాఖీ పండుగ వరంగల్ రీజియన్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను పెద్ద సంఖ్యలో నడిపింది.
రాఖీ రద్దీతో వరంగల్ రీజియన్‌కు రూ.17.10 కోట్ల ఆదాయం
హనుమకొండ: రాఖీ పండుగ వరంగల్ రీజియన్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను పెద్ద సంఖ్యలో నడిపింది. ఆగస్టు 26 నుంచి 31 వరకు ఆరు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక రవాణా ద్వారా వరంగల్ రీజియన్ పరిధిలోని 9 డిపోలను కలిపి రూ.17కోట్ల 10లక్షల 61వేయి 98 ఆదాయాన్ని ఆర్జించాయి. ఆరు రోజుల్లో మొత్తం బస్సులు 24,99,032 కిలోమీటర్లు తిరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాఖీ పండుగకు ముందు నుంచే ప్రయాణికుల రద్దీని అంచనా వేసిన అధికారులు అం దుకు అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచడంతో ఆదాయం గణనీయంగా పెరిగినట్లు తెలిపారు.
వరంగల్-2 డిపోకు అగ్రస్థానం..
రాఖీరద్దీని సొమ్ము చేసుకోవడంలో వరంగల్-2 డిపో ముందంజలో నిలిచింది. ఆరు రోజుల వ్యవధిలో వరంగల్-2 డిపో బస్సులు 3లక్షల 84వేల 841 కిలోమీటర్లు ప్రయాణించి రూ.2కోట్ల 58లక్షల 56వేల 976 ఆదాయాన్ని సాధించాయి. మొత్తం రీజియన్ ఆదాయంలో అత్యధిక వాటాను ఈ డిపోనే నమోదుచేసింది. వరంగల్-1 డిపోలో బస్సులు 4లక్షల 10వేల 088 కిలోమీటర్లు ప్రయాణించగా రూ.2కోట్ల 38లక్షల 20వేల 190 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
హనుమకొండ డిపో 3లక్షల 39వేల 012 కిలోమీటర్ల మేరకు బస్సులు ప్రయాణించగా రూ.2 కోట్ల 29లక్షల 24వేల 173 ఆదాయం సమకూర్చింది. తొర్రూరు డిపోలోని బస్సులు 2లక్షల 63వేల 423 కిలోమీటర్లు ప్రయాణించగా రూ.2కోట్ల 4ల క్షల 3వేల547 ఆదాయం సమ కూరింది. జనగామ డిపోలోని బస్సులు 2లక్షల 89వేల 757 కిలోమీటర్లకు గాను రూ.2కోట్ల 1లక్ష 81వేయి 709 ఆదాయం, భూపాలపల్లి డిపోకు చెందిన బస్సులు 2లక్షల 43వేల756 కిలోమీటర్లకు గాను రూ.1కోటి 79లక్షల 16వేల 857 ఆదాయం,
నర్సంపేట డిపోకు చెందిన బస్సులు 2లక్షల 13వేల 106 కిలోమీటర్లు ప్రయాణించగా రూ.1కోటి 50లక్షల 12వేల 390 ఆదాయం, పరకాల డిపోకు చెందిన బస్సులు 1లక్షా 85వేల 244 కిలోమీటర్లకు గాను రూ.1కోటి 32లక్షల 71వేయి 529 ఆదాయం, మహబూబాబాద్ డిపోకు చెందిన బస్సులు 1లక్షా 69వేల 785 కిలోమీటర్లకు గాను రూ.1కోటి 16లక్షల 73వేల 727 ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ప్రణాళికతో పెరిగిన ఆదాయం..
పండుగ సమయంలో అవసరాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను నడిపితే సంస్థకు ఆదాయం పెరగడంతోపాటు మెరుగైన రవాణా సౌకర్యం కలిగిందని ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన రూట్లలో సర్వీసులను పెంచడం, డిపోల స్థాయిలో సమన్వయంతో పనిచేయడం వల్లే ఈస్థాయిలో ఆదాయం సాధ్యమైందని వరంగల్ రీజినల్ మేనేజర్ భవానిప్రసాద్ పేర్కొన్నారు. రాబోయే పండుగలు, సెలవుల సమయంలోనూ ఇదేతరహాలో ముందస్తు ప్రణాళికతో సర్వీసులు నిర్వహించేందుకు అధికారులు, ఆర్టీసీ సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్తామని ఆర్‌ఎం తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఘాటెక్కిన ఉల్లి.. నెల రోజుల్లోనే ఆకాశాన్నంటిన ధరలు
పదవి ఉన్నా లేకున్నా నా గౌరవం నాకుంది
Read Latest AP News And Telangana News And International News And Telugu News