Share News

రామప్ప చెంత మరో చారిత్రక వైభవం..!

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:59 PM

మలుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేట రామప్ప దేవాలయం సమీపంలోని మరో అపు రూప కట్టడానికి జాతీయ స్థాయి రక్షణ లభిం చింది.

రామప్ప చెంత మరో చారిత్రక వైభవం..!
Palampet Shiva Temple

  • పాలంపేట శివాలయానికి జాతీయ హోదా

  • అధికారికంగా గెజిట్‌ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

ములుగు: మలుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేట రామప్ప దేవాలయం సమీపంలోని మరో అపు రూప కట్టడానికి జాతీయ స్థాయి రక్షణ లభిం చింది. రామప్ప ఆలయానికి ఉప ఆలయంగా పాలంపేటలో ఉన్న మరో శివాలయానికి ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా అధికారికంగా సోమవారం తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర ఏఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ యదుబీర్‌సింగ్‌ రావత్‌ పేరుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.


1958 నాటి పురాతన కట్టడాలు, పురావస్తు ప్రదేశాల చట్టం ప్రకారం ఈ చారి త్రక ఆలయాన్ని సంరక్షించనున్నారు. గతంలో జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై వచ్చిన అభ్యంతరాలను అన్నింటిని పరిశీలించిన అనంతరం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ తుదినిర్ణయాన్ని ప్రకటించింది. ఈ గెజిట్‌ నోటిఫికేషన్‌లో పాలంపేటలోని సర్వేనంబర్‌ 382/1/2 పరిధిలోని 0.275ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని రక్షిత ప్రాంతంగా పేర్కొంది. ఆలయం చుట్టూ ఉన్న సరిహద్దులను స్పష్టం గా మ్యాప్‌తో సహా గెజిట్‌లో పొందుపరిచారు.


hnk3.2.jpgఇకపై ఈ నిర్ణిత పరిధి ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఆధీనంలోకి వెళ్లనుంది. ఈ రక్షిత పరిసర ప్రాంతంలో ఎలాంటి అనధికారిక తవ్వకాలు, ప్రైవేటు నిర్మాణాలు చేపట్టడం నిషిద్ధం. ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంతో పాలంపేట అంతర్జాతీ య పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇప్పుడు దాని సమీపంలోని ఈ శివాలయానికి జాతీయ హోదా దక్కడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా ప్రత్యేక నిధులు మంజూరు కానున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

అధిక పాల కోసం కక్కుర్తి.. పశువులకు పాచి బిర్యానీ..!

శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 12:59 PM