సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్.. సీఎం విజయ్ నిందితుడు కాదన్న ధర్మాసనం..
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:15 PM
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కి వ్యతిరేకంగా డీఎంకే వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరూర్ తొక్కిసలాట కేసుపై సీఎం విజయ్, టీవీకే మంత్రులు బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలన్న డీఎంకే పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ, జులై 7: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కి వ్యతిరేకంగా డీఎంకే వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరూర్ తొక్కిసలాట కేసుపై సీఎం విజయ్, టీవీకే మంత్రులు బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలన్న డీఎంకే పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గ్యాగ్ ఆర్డర్ (Gag Order) జారీ చేసేందుకు జస్టిస్ అహ్రానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ షీల్ నాగుల వెకేషన్ బెంచ్ నిరాకరించింది. కరూర్ దుర్ఘటన కేసులో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నిందితుడు కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
రాజకీయ నాయకులు చేసుకునే పరస్పర విమర్శలు, బహిరంగ ప్రకటనలపై కోర్టు ఆంక్షలు విధించలేదని స్పష్టం చేసింది. సీబీఐ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తోందని, రాజకీయ వ్యాఖ్యల వల్ల దర్యాప్తు ప్రభావితం కాదని తేల్చి చెప్పింది. దీంతో దాఖలు చేసిన అప్లికేషన్‌ను డీఎంకే తక్షణమే ఉపసంహరించుకుంది. కాగా, జులై 10వ తేదీన సీఎం విజయ్.. కరూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ తరుణంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో టీవీకే వర్గాల్లో ఉత్సాహం నెలకొంది.
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం
ఫిఫా ప్రపంచ కప్: అమెరికా ఓటమి.. ‘ట్రంప్ డ్యాన్స్’ చేసిన బెల్జియం ప్లేయర్