జగన్ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:13 PM
జోసఫ్ రావణ్ వంటి వ్యక్తిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమర్థించడం దుర్మార్గమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఈ వ్యవహారంపై జగన్ స్పందించి.. భారతీయులు, అన్ని మతాల ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
నెల్లూరు: జోసఫ్ రావణ్ వంటి వ్యక్తిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమర్థించడం దుర్మార్గమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. దేవుళ్లు, పీఠాధిపతులపై జోసఫ్ రావణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసినా జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జోసఫ్ రావణ్‌ను ఎందుకు సమర్థిస్తున్నారని నిలదీశారు. దేవుడిని నమ్మడం, నమ్మకపోవడం వ్యక్తిగత విషయమని, కానీ ఎవరికీ మత విశ్వాసాలను అవమానించే హక్కు లేదన్నారు.
జోసఫ్ రావణ్‌పై నమోదైన కేసులను న్యాయస్థానాలే తేల్చాలని, అలాంటి కేసులు పెట్టడం తప్పని ఎలా చెబుతారని జగన్‌ను ప్రశ్నించారు. జోసఫ్ రావణ్‌ను జగన్ సమర్థించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించిన కోటంరెడ్డి, వైసీపీ అధ్యక్షుడిగా జగన్.. భారతీయులకు, అన్ని మతాల ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా, గతంలో వైఎస్ భారతిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కూడా జోసఫ్ రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి వివరించారు.
Also Read:
31 శాఖల్లో పెండింగ్ కేసులు.. సీఎస్ కీలక ఆదేశాలు
ఐరన్ లోపం.. మైగ్రేన్‌కు కారణమవుతుందా?