ఐరన్ లోపం.. మైగ్రేన్‌కు కారణమవుతుందా?
ABN , Publish Date - Jul 04 , 2026 | 02:44 PM
మైగ్రేన్, రక్తహీనత రెండూ చాలా మందిని వేధిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యలు. అయితే ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతకు, మైగ్రేన్ తలనొప్పికి మధ్య సంబంధం ఉండొచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో మైగ్రేన్, రక్తహీనత (అనీమియా) ప్రధానమైనవి. తాజాగా వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం.. ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనతకు, మైగ్రేన్ తలనొప్పికి మధ్య సంబంధం ఉండే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, రక్తహీనతే మైగ్రేన్‌కు నేరుగా కారణమని మాత్రం ఈ అధ్యయనం నిర్ధారించలేదు. కానీ ఈ రెండింటి మధ్య సంబంధం ఉండొచ్చని సూచించింది.
అధ్యయనం ఏం చెబుతోంది?
పబ్‌మెడ్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. శరీరంలో ఐరన్ లోపం ఎక్కువగా ఉన్నవారిలో మైగ్రేన్ సమస్య కనిపించే అవకాశం అధికంగా ఉంది. హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోవడంతో మెదడుకు అవసరమైనంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే దీనిపై మరింత పరిశోధన అవసరమని కూడా వారు పేర్కొన్నారు.
రక్తహీనత లక్షణాలు
తరచూ అలసటగా అనిపించడం
నీరసం
తల తిరగడం
త్వరగా ఆయాసం రావడం
చర్మం పాలిపోయినట్లు కనిపించడం
ఏకాగ్రత తగ్గిపోవడం
మైగ్రేన్ లక్షణాలు
తలకు ఒక వైపు తీవ్రమైన నొప్పి
వికారం, వాంతులు
వెలుతురు లేదా పెద్ద శబ్దాన్ని తట్టుకోలేకపోవడం
ఈ సమస్యలను ఎలా తగ్గించుకోవాలి?
రోజూ ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఆకుకూరలు, పప్పులు, బీన్స్, బెల్లం, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తగినంత నీరు తాగడం, సరిపడా నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా అవసరం. తరచూ తలనొప్పి లేదా రక్తహీనత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలి. వైద్యుల సలహా లేకుండా మందులు వాడకూడదు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్