Share News

పాకాల ఆయ‘కట్’..

ABN , Publish Date - Sep 18 , 2026 | 10:22 AM

ఓరుగల్లు ధాన్యాగారంగా ప్రసిద్ధి పొందిన పాకాల సరస్సు ఆయకట్టులో ఈ ఏడాది కరువు ఛాయలు కనిపిస్తు న్నాయి.

పాకాల ఆయ‘కట్’..
Warangal Drought

  • వర్షాభావ పరిస్థితులతో నిండని సరస్సు

  • 23 వేల ఎకరాలకు గాను 14 వేల ఎకరాల్లోనే సాగు

  • ఖరీఫ్‌కు నీటి విడుదలలో అధికారుల పర్యవేక్షణ లోపం

  • సాగు రైతులకు తప్పని తిప్పలు

  • కొంతమేర ఆదుకున్న రామప్ప-పాకాల ప్రాజెక్టు

ఖానాపురం(వరంగల్): ఓరుగల్లు ధాన్యాగారంగా ప్రసిద్ధి పొందిన పాకాల సరస్సు ఆయకట్టులో ఈ ఏడాది కరువు ఛాయలు కనిపిస్తు న్నాయి. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పాకాల ఆయకట్టులో సాగు అసంపూర్తిగా చేపట్టారు. గతంలో రాష్ట్రమంతటా కరువు కాటకాలు సంభ వించినప్పటికీ పాకాల ఆయకట్టులో మాత్రం ఒక పంటకు ఎలాంటి ఢోకా ఉండే ది కాదు. పూర్తిగా వర్షాధారమైనప్పటికీ ఎగువ ప్రాంతంలో కురిసే చెదురు మ దురు వర్షాలకే సరస్సులోకి నీరు చేరి ఒక పంట పండేది. ప్రస్తుతం పాకాలను గోదావరి జలాలతో అనుసంధానం చేశారు. అయితే ఈ ఏడాది తీవ్ర వర్షా భావ పరిస్థితుల నేపధ్యంలో గోదావరిలోనూ నీటి లభ్యత దృష్ట్యా అధికారులు ఆలస్యంగా స్పందించడంతో ఆయకట్టులో రైతులు సగం సాగునే చేపట్టడం కరువు తీవ్రతకు అద్దంపడుతున్నది.


గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో రోజుల తరబడి పాకాల సరస్సు మత్తడి పోసింది. గత ఏడాది ఇదే సెప్టెంబరు మాసంలో పాకాల గరిష్ట నీటిమ ట్టంతో కళకళలాడింది. వానాకాలం, యాసంగి రెండు పంటలకు పూర్తిస్థాయిలో సాగు నీటిని అందించినప్పటికీ పాకాల సరస్సులో 16 అడుగుల నీటి మట్టం ఉంది. దీంతో సాగుపై భరోసాతో ఈ ఏడాది వానాకాలంలో రైతులు సకాలం లోనే నార్లు పోసుకున్నారు. కొద్దో గొప్పో నీటి వనరులు ఉన్న రైతులు నాట్లు సైతం వేసుకున్నారు. కొందరు రైతులు వెదజల్లే విధానంలో సాగు చేద్దామని వర్షాల కోసం ఎదురుచూసారు. కానీ వర్షాలు సకాలంలో కురవకపోవడం అదను దాటిపోవడంతో నాట్లు వేసుకోవడానికి రైతులు వెనుకంజ వేసారు.


స్పష్టతనివ్వడంలో అధికారులు విఫలం

పాకాల సరస్సులో 16 అడుగుల నీటి మట్టం ఉన్నప్పటికీ, నారు మడులకు నీటిని విడుదల చేయడంలో అధికారులు ఆలస్యం చేశారు. ఒకపక్క వర్షాల లేమి, పరోపక్క అధికారులు నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు అయోమయానికి గురయ్యారు. రామప్ప నుండి గోదావరి జలాల ను పాకాలకు మళ్లించినప్పటికీ ఎప్పుడు నీటిని విడుదల చేస్తున్నారో రైతులకు స్పష్టతనివ్వడం లో అధికారులు విఫలమయ్యారు. దీంతో పాకాల ఆయకట్టు విస్తీర్ణం 23వేల ఎకరాలకు గాను 14వేల ఎకరాల్లో మాత్రమే రైతులు పంటలను సాగుచేస్తున్నారు. 60శాతం మంది రైతులు మాత్రమే పంటలను సాగుచేస్తున్నారు. ప్రస్తు తం పాకాలలో 21 అడుగులకు పైగా నీరున్న ప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపంతో పంటలను సాగుచేసే రైతులకు క్షేత్రస్థాయిలో అనే క ఇబ్బందులు తలెత్తుతున్నాయి.పంట కాలువల పరిస్థితి అధ్వానంగా ఉం ది. చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు.


hnk1.jpgగోదావరి జలాల రాకతో

పాకాలకు గోదావరి జలాల రాకతోనే ఈ ఏడాది ఆయకట్టులో కొంతమేర అయినప్పటికీ సాగు సాధ్యమైంది. పాకాలకు శాశ్వత జలవనరులు కల్పించేందుకు 2021లో అప్పటి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి రామప్ప-పాకాల ప్రాజెక్టును మంజూరు చేయించారు. ప్రతి సంవత్సరం 3.23 టిఎంసి ల నీటిని వాడుకునేలా అనుమతులు తీసుకువచ్చారు. నాటి నుండి ఇప్పటివరకు 7 నుండి 8 టిఎంసిల నీటిని వాడుకున్నట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కృషితో ఇప్పటివరకు 1 టిఎంసి పైగా నీటిని వాడుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పాకాలలో 21 అడుగులకు పైగా నీరుంది. దీంతో పంటలు పూర్తిస్థాయిలో పండించుకోవచ్చని వారు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

పుష్పక్‌ బస్సుల్లో ఎయిర్‌పోర్టుకు తగ్గిన ప్రయాణికులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 10:22 AM