Share News

దారుణం.. 6 నెలల శిశువుపై పిట్ బుల్ దాడి..

ABN , Publish Date - Sep 18 , 2026 | 08:52 AM

హర్యానాలోని సోనిపట్‌లో ఘోరం జరిగింది. ఆరు నెలల శిశువుపై పిట్ బుల్ శునకం దాడి చేసింది. సోనిపట్‌లోని సిక్కా కాలనీలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

దారుణం.. 6 నెలల శిశువుపై పిట్ బుల్ దాడి..

ఇంటర్‌నెట్ డెస్క్: హర్యానాలోని సోనిపట్‌లో ఘోరం జరిగింది. ఆరు నెలల శిశువుపై పిట్ బుల్ శునకం దాడి చేసింది. సోనిపట్‌లోని సిక్కా కాలనీలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. చిన్నారి బంధువు బేబీని తీసుకుని వీధిలో నడుచుకుంటూ ఉండగా.. అకస్మాత్తుగా ఓ పిట్ బుల్ వారి వద్దకు లంఘించింది. కుక్క నుంచి చిన్నారిని కాపాడేందుకు ఆమె ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఆ మహిళ నుంచి చిన్నారిని కుక్క తన నోట్లో పెట్టుకుని ఈడ్చుకుని పోయింది. ఈ క్రమంలో శిశువు నేలపై పడిపోయింది. తర్వాత చిన్నారిని కుక్క రోడ్డుపై అలాగే లాక్కునిపోయింది. అక్కడున్న వారు చిన్నారిని కాపాడేందుకు యత్నించినా వీలు కాలేదు. ఎంత అదిలించినా చిన్నారిని కుక్క వదలలేదు. కుక్క దాడిలో శిశువు తీవ్రంగా గాయపడింది. బేబీని రోహ్‌తక్‌లోని ఆసుపత్రికి తరలించారు. శిశువు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే, కుక్క దాడిపై చిన్నారి కుటుంబ సభ్యులు ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.


స్థానికుల్లో భయాందోళనలు

ఆరు నెలల చిన్నారిపై పిట్ బుల్ దాడి చేయడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కుక్క యజమాని నిర్లక్ష్యంపై పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు అలాంటి భయానక జాతికి చెందిన కుక్కను పెంచుకునేందుకు తగిన అనుమతులను యజమాని తీసుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు. నిరుడు కూడా ఢిల్లీలో ఆరేండ్ల బాలుడిపై పిట్ బుల్ దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి కుడి చెవికి తీవ్రంగా గాయమైంది. తర్వాత కుక్క యజమానిని పోలీసులు అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు.


Also Read:

బార్బెక్యూ మంటల్లో నవ వధువు.. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన భయానక ఘటన..

ఒకవైపు హత్యలు..మరోవైపు దొంగతనాలు..ఈ నగరానికి ఏమైంది?

Updated Date - Sep 18 , 2026 | 10:11 AM