నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాదం.. సర్వీస్ రివాల్వర్‌తో రిజర్వ్ ఎస్సై ఆత్మహత్య..
ABN , Publish Date - Sep 18 , 2026 | 09:23 AM
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. రిజర్వ్ ఎస్సై సతీశ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనతో పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. రిజర్వ్ ఎస్సై సతీశ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనతో పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సతీశ్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, సతీశ్ ఆత్మహత్యకు అప్పుల బాధే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. బలవన్మరణానికి అసలు కారణాలు ఏమిటన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ఆయన వ్యక్తిగత, ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. పోలీసు శాఖలో ఇటీవల కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. నెల రోజుల కిందట హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే గతేడాది సంగారెడ్డి టౌన్ పీఎస్‌లో ఏఆర్ కానిస్టేబుల్ సందీప్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ వార్తలు కూడా చదవండి
మిర్యాలగూడలో ట్యాంకర్ బీభత్సం.. అంబులెన్స్ సిబ్బందికి సహాయం చేస్తూ ఒకరి మృతి..
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..