Share News

హెచ్‌సీయూకు ఐసీఎంఆర్‌ నుంచి రూ. 4.98కోట్ల గ్రాంట్‌

ABN , Publish Date - Sep 18 , 2026 | 09:36 AM

పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) కోసం ఏఐ-ఆధారిత రక్త పరీక్షను అభివృద్ధి చేయడానికి హెచ్‌సీయూ పరిశోధకులకు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నుంచి రూ.4.98 కోట్ల ఐసీఎంఆర్‌ గ్రాంట్‌ లభించింది.

హెచ్‌సీయూకు ఐసీఎంఆర్‌ నుంచి రూ. 4.98కోట్ల గ్రాంట్‌
University of Hyderabad

హైదరాబాద్‌ సిటీ: పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) కోసం ఏఐ-ఆధారిత రక్త పరీక్షను అభివృద్ధి చేయడానికి హెచ్‌సీయూ పరిశోధకులకు ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నుంచి రూ.4.98 కోట్ల ఐసీఎంఆర్‌ గ్రాంట్‌ లభించింది. హెచ్‌సీయూలోని స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ బృందం పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ కోసం దేశంలోనే మొట్టమొదటి సింగిల్‌-సెల్‌ ట్రాన్ర్స్కిప్టోమిక్‌ అట్లా్‌సను నిర్మించడంతో పాటు, వ్యక్తిగత సంతాన సాఫల్య సంరక్షణకు తక్కువ-ధర నిర్ధారణ వేదికను రూపొందించనుంది.


ఐసీఎంఆర్‌ ఇంటర్మీడియట్‌ ఎక్స్‌ట్రామ్యూరల్‌ గ్రాంట్స్‌-2026 కింద మంజూరైన ఈ కార్యక్రమం, విశ్వవిద్యాలయానికి ఇటీవల అందిన అతిపెద్ద ఎక్స్‌ట్రామ్యూరల్‌ నిధుల పురస్కారాలలో ఒకటిగా నిలుస్తుందని అధికారులు వెల్లడించారు.


city4.2.jpgఆపరేషన్‌ అవసరం లేని రక్తపరీక్ష

‘‘నాన్‌-ఇన్వాసివ్‌ పీసీఓఎస్‌ థెరనోస్టిక్స్‌, మాలిక్యులర్‌ ఎండోటైపింగ్‌, ఎర్లీ డిస్కవరీ కోసం సిస్టమిక్‌- ఫోలిక్యులర్‌ సింగిల్‌-సెల్‌ ట్రాన్ర్స్కిప్టోమిక్స్‌ యొక్క మల్టీ-మోడల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంటిగ్రేషన్‌’’ అనే పేరుతో ఉన్న ఈ ప్రాజెక్ట్‌, దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలను ప్రభావితం చేస్తున్న వంధ్యత్వానికి ప్రధాన కారణమైన పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ కోసం,


అధునాతన జెనోమిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి, శస్త్రచికిత్స అవసరం లేని, సరసమైన రక్తపరీక్షను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈనెల 1న ఐసీఎంఆర్‌ ఆమోదం తెలిపిన అనంతరం, ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. దీనికి తొలి సంవత్సరానికిగాను రూ.1.52 కోట్ల ప్రారంభ నిధులు కేటాయించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

పుష్పక్‌ బస్సుల్లో ఎయిర్‌పోర్టుకు తగ్గిన ప్రయాణికులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 09:36 AM