ధాన్యం ధర మరింత పైపైకి..
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:30 PM
మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధర రోజురోజుకు పెరుగుతోంది.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాకు రూ.2,762
10 రోజులుగా నిత్యం పెరుగుతున్న రేట్లు
కేసముద్రం(మహబుబాబాబాద్): మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధర రోజురోజుకు పెరుగుతోంది. మార్కెట్‌కు మంగళవారం ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యాన్ని 20 మంది రైతులు 640 బస్తాల్లో తీసుకురాగా, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) విధానంలోని ‘ఈ-వేలం’లో క్వింటాకు గరిష్ఠంగా రూ.2,762, కనిష్ఠంగా రూ.2,329, సగటున రూ.2,729 ధరలతో వ్యాపారులు ఖరీదులు చేశారు. ధాన్యానికి ప్రభుత్వ కనీస మద్ద తు ధర (ఎంఎల్పీ) క్వింటాకు రూ.2,389 ఉండగా ఈ సీజన్‌లో అంతకంటే ఎక్కువగానే మార్కెట్లో ధరలు ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయనే కారణాలతో వ్యా పారులు నిల్వ చేసేందుకు మార్కెట్లో ధాన్యం ఖరీదులు పెంచారు.
ఈ క్రమంలో దేశీయంగా ధాన్యానికి డిమాండ్ ఏర్పడడంతో మార్కెట్లో ఈ సీజన్‌లో గత పది రోజులుగా ధాన్యం సగటు ధర పెరుగుతూ వస్తోంది. ఈ నెల 1న ధాన్యం సగటు ధర రూ.2,475 నుంచి రూ.2495 వరకు ఉన్నాయి. ఆ తర్వాత ఈ నెల 4న సగటు ధర రూ.2,589, 5న రూ.2,636, 8న రూ.2,689, తాజాగా మంగళవారం రూ.2729గా నమోదయ్యాయి. ఇలా పది రోజులుగా నిత్యం క్రమంగా ధర పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల స్వల్పంగా మరో నెలరోజుల వరకు ఉంటుందని, ఆ తర్వాత అప్పటి వర్షపాతం అనుగునంగా ధరలు ప్రభావితం అవుతాయని వ్యాపారులు అంచ నా వేస్తున్నారు. ఏదేమైనా ఎల్‌నినో ప్రభావంతో ఇక్కడి మార్కెట్లో ధాన్యం ధరలు ఊహించని విధంగా పెరుగుతోండడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి:
కొమురవెల్లి మల్లన్నకు ఇన్‌చార్జి గ్రహణం!
కాంగ్రెస్ డివిజన్ కమిటీల ఏర్పాటు ఎప్పుడో?
Read Latest AP News And Telangana News And International News And Telugu News