పిల్లల భవిష్యత్తును మార్చే అలవాట్లు ఇవే
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:00 PM
పిల్లల భవిష్యత్తు చిన్నప్పటి నుంచి అలవర్చుకునే అలవాట్లతో రూపుదిద్దుకుంటుంది. స్నేహితుల ఎంపిక నుంచి క్రమశిక్షణ వరకు, భావోద్వేగ నియంత్రణ నుంచి నిజాయితీ వరకు కొన్ని ముఖ్యమైన విలువలు పిల్లల వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: పిల్లల పెంపకం విషయంలో చాణక్యుడు చెప్పిన కొన్ని విలువలు ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి. చిన్నతనంలో నేర్చుకున్న అలవాట్లు, విలువలే వారి భవిష్యత్తును నిర్దేశిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా నేర్పాల్సిన ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మంచి స్నేహితులు
పిల్లల వ్యక్తిత్వ వికాసంలో స్నేహితుల పాత్ర చాలా కీలకం. మంచి స్నేహితులు మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు నేర్పుతారు. కాబట్టి పిల్లలు తమను ప్రోత్సహించే, మంచి మార్గంలో నడిపించే వారితోనే స్నేహం చేయాలని నేర్పించాలి.
వ్యక్తిత్వం
నిజాయితీ, నమ్మకం, మంచి విలువలు కలిగి ఉండటం జీవితంలో అత్యంత ముఖ్యమని పిల్లలకు తెలియజేయాలి.
వ్యక్తిగత విషయాలు
ప్రస్తుతం సోషల్ మీడియా కాలంలో వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం సాధారణమైంది. అయితే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు, నమ్మకమైన వారితో మాత్రమే ముఖ్యమైన విషయాలను పంచుకోవాలని పిల్లలకు నేర్పించాలి.
మాట్లాడే ముందు ఆలోచించాలి
ఒకసారి మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోలేం. కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించడం, అవసరమైన మాటలనే మాట్లాడడం అలవాటు చేయాలి.
కష్టపడటం, క్రమశిక్షణ
విజయానికి షార్ట్‌కట్స్ ఉండవు. కష్టపడే తత్వం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటేనే లక్ష్యాలను చేరుకోవచ్చని పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి.
భావోద్వేగాలను నియంత్రించుకోవడం
కోపం, ఆవేశం, నిరాశ వంటి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. పరిస్థితులను ప్రశాంతంగా ఎదుర్కొని సరైన నిర్ణయాలు తీసుకునేలా పిల్లలను తీర్చిదిద్దాలి.
చిన్నతనంలోనే ఈ విలువలు, అలవాట్లు పిల్లలకు నేర్పిస్తే వారు బాధ్యతాయుతమైన, విజయవంతమైన వ్యక్తులుగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాణక్యుడు సూచించారు.
Also Read:
విండ్ చైమ్.. ఈ ప్రదేశాల్లో అస్సలు పెట్టకండి
ఫిట్‌నెస్ కోసం భోజనం మానేస్తున్నారా? జాగ్రత్త..