కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇంకెప్పుడు..?
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:11 PM
కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు పట్టిన గ్రహణం తొలగ డం లేదు. మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత దుస్థితి దేశ వ్యాప్తంగా ఏర్పడింది.
మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావంతో నిలిచిన వైనం
కొత్త వాటి కోసం పడిగాపులు
సింగిల్ సిలిండర్ కూడా దొరకని దుస్థితి
హనుమకొండ: కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు పట్టిన గ్రహణం తొలగ డం లేదు. మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత దుస్థితి దేశ వ్యాప్తంగా ఏర్పడింది. యుద్ధం నేపథ్యంలో పాత కనెక్షన్లకే గ్యాస్ సిలిండర్ల సరఫరా గగనంగా మారడంతో కొత్త కనెక్షన్ల మంజూరు నిలిపివేశారు. యుద్ధానంతరం పరిస్థితులు చక్కబడడంతో పాత కనెక్షన్లపై విధించిన నిబంధనలను కూడా సడలించి గ్యాస్ సిలిండర్లను కంపెనీలు సరఫరా చేస్తున్నారు. అయితే...కొత్త కనెక్షన్లను మాత్రం నిలిపివేశారు. మిడిల్ ఈస్ట్ వార్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు 9 నెలలు గడిచాయి. ఇంకా... కొత్త కనెక్షన్లకు పడిన బ్రేకులు తొలగలేదు.
9 నెలలుగా సడలని గ్రహణం
కొత్త కనెక్షన్ల కోసం ప్రజలు పడిగాపులు కాస్తు న్నారు. 9 నెలలుగా సిలిండర్ నిరీక్షణ తొలగడం లేదు. కనెక్షన్ల కోసం ప్రజలు ఏజెన్సీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఏజెన్సీలు మాత్రం ఇంకా విషయం తేలలేదంటూ చెబుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభు త్వం, ఆయిల్ కంపెనీలే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. కనీసం సింగిల్ సిలిండర్ మంజూరి కూడా లేకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా పెళ్లాయిన జంటలు, బ్యాచిలర్స్‌కు అయితే వంట కష్టాలు తొలగడం లేదు. యుద్ధం ముగిశాక కనెక్షన్ లభిస్తుందని ఆశపడ్డా....సమస్య తీరక వంట కోసం తంటాలు పడుతున్నారు. ఇక యుద్ధం ఆరంభానికి ముందుగా బుక్ చేసిన కొత్త కనెక్షన్లకు కూడా మోక్షం లేదు. తాము ముందే బుక్ చేసుకున్నాం కనుక వస్తుందని ఆశపడ్డ వారికి కూడా నిరాశే మిగిలింది. యుద్ధం ఆరంభానికి ముందు ఏజెన్సీలు ఒక్క రోజులోనే గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. కొత్త కనెక్షన్ల నిలిపివేత పేరుతో మార్కెట్లోకి మినీ సిలిండర్లు ప్రవేశించాయి. తొలుత మినీ సిలిండర్లను కూడా డొమెస్టిక్ విభాగంగా 5 కేజీ, 10 కేజీల సిలిండర్లను ప్రవేశ పెట్టారు. వీటిని రూ. 376.50, రూ.732.50 అందుబాటులోకి తెచ్చారు. అయితే కొద్ది రోజులకే వీటిని బ్లాక్ చేశారనే ఆరోపణలు నెలకొన్నాయి.
10 కిలోల కమర్షియల్ మినీ సిలిండర్‌నే విక్రయిస్తుండడంతో విధి లేని పరిస్థితుల్లో కొత్త కనెక్షన్లు కావాలనుకునే ప్రజలు ఆర్థికంగా భారమైనా భరించి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మినీ సిలిండర్ కనెక్షన్లు ప్రజలపై గ్యాస్ బండ భారాన్ని మోపాయనే వాదనలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. కంపెనీల లాభార్జన నిర్ణయం ప్రజ లకు శాపంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. వంట కష్టాలతో అనివార్యంగా ప్రజలు మినీ సిలిండర్లను విక్రయించాల్సి వస్తోంది. 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్ ధర రూ.1013 అయితే...10 కిలోల మినీ సిలిండర్ ధర రూ.1760గా ఉందంటూ వాపోతున్నారు. అంతే కాదు బుకింగ్ డిపాజిట్ కూడా రిఫండబుల్ లేదు. ఇది తమకు పెను భారమే అని ప్రజలు వాపోతున్నారు. కొత్త కనెక్షన్ల కొరత సృష్టించి ఈ విధంగా మినీ సిలిండర్లను రుద్దడం సరి కాదనే వాదనలు వినిపి స్తున్నారు. అయితే మినీ సిలిండర్ల విషయంలో మరో కోణంలో అభిప్రాయాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింతగా కిందకు పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News