తెలంగాణ ఉద్యమ పాదయాత్రకు 15 ఏళ్లు.. ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్న కేటీఆర్
ABN , Publish Date - Nov 17 , 2026 | 11:07 AM
తెలంగాణ ఉద్యమంలో భాగంగా 15 ఏళ్ల క్రితం ఆరు రోజుల పాటు సాగిన పాదయాత్రను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ‘ఎక్స్’ వేదికగా ఆనాడు తాను చేపట్టిన పాదయాత్రకు సంబంధించిన జ్ఞాపకాలను పంచుకున్నారు.
హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణ ఉద్యమంలో భాగంగా 15 ఏళ్ల క్రితం ఆరు రోజుల పాటు సాగిన పాదయాత్రను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ‘ఎక్స్’ వేదికగా ఆనాడు తాను చేపట్టిన పాదయాత్రకు సంబంధించిన జ్ఞాపకాలను పంచుకున్నారు. వికారాబాద్ నుంచి మొదలైన పాదయాత్ర కుత్బుల్లాపూర్ వరకు సాగినట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఉద్యమ దళపతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు 2011 నవంబర్ 16 నుంచి 21 వరకు ఆరు రోజుల పాటు సాగిన పాదయాత్రను గుర్తుచేసుకుంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

2011లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఈ పాదయాత్ర నిర్వహించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. వికారాబాద్ నుంచి మొదలైన పాదయాత్ర నవాబ్‌పేట్, శంకర్‌పల్లి, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, బాలానగర్ సర్కిల్ మీదుగా కుత్బుల్లాపూర్‌కు చేరుకుందని వివరించారు. ఆనాటి ఆరు రోజుల పాదయాత్ర సబ్బండ వర్గాలు మద్దతుతో స్ఫూర్తిదాయకంగా సాగిందని కేటీఆర్ గుర్తుచేసుకుంటూ చివరగా ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు. అలాగే అప్పటి పాదయాత్ర ఫొటోలను ఎక్స్‌లో మాజీ మంత్రి కేటీఆర్ షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి...
కోనసీమలో గ్యాస్ లీకేజీ.. ప్రజలను ఖాళీ చేయించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు
విశాఖలో 20 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి
Read Latest Telangana News And Telugu News