Share News

విశాఖలో 20 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి

ABN , Publish Date - Nov 17 , 2026 | 10:22 AM

విశాఖపట్నంలోని పీఎంపాలెం క్రికెట్ స్టేడియం సమీపంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో 20 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

విశాఖలో 20 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి
Visakhapatnam News

విశాఖపట్నం, నవంబర్ 17: నగరంలో ఓ యువతి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. పీఎంపాలెం క్రికెట్ స్టేడియం వద్ద హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతిచెందిన యువతి త్రివేణి (20)గా గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.


మన్యం జిల్లాకు చెందిన యువతి.. కొమ్మాదిలో నివాసం ఉంటోంది. రూమ్‌లో త్రివేణి ఒక్కరే ఉంటున్నట్లు సమాచారం. యువతి మృతిపై కేసు నమోదు చేసిన పీఎం పాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్రివేణి మృతికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. యువతి అనుమానాస్పద మృతి స్థానికంగా సంచలనం రేపింది.


ఇవి కూడా చదవండి...

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

కోనసీమలో గ్యాస్ లీకేజీ.. ప్రజలను ఖాళీ చేయించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 10:24 AM