Share News

అధిక ధరలకు బియ్యం విక్రయాలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 10:37 AM

ఎల్‌నినో ప్రభావం సాకుతో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం జీడిమెట్ల సర్కిల్‌లో బియ్యం వ్యాపా రులు సిండికేట్‌గా మారి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

అధిక ధరలకు బియ్యం విక్రయాలు
Rice Prices

  • ప్రజలను నిలువునా దోచుకుంటున్న వ్యాపారులు

  • కుత్బుల్లాపూర్‌ వైపు చూడని సివిల్‌ సప్లై అధికారులు

హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం సాకుతో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం జీడిమెట్ల సర్కిల్‌లో బియ్యం వ్యాపా రులు సిండికేట్‌గా మారి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణ యించిన ధరల కన్నా.. అధికంగా ధరలు నిర్ణయించి నిరుపేదలను దోచు కుంటున్నారు. బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సామాన్యు లకు ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో పర్యవేక్షణ లోపించడం పట్ల వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరమంతా సివిల్‌ సప్లై శాఖాధికారులు దాడులు నిర్వ హిస్తూ అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తున్నప్పటికీ మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని జీడిమెట్ల, చింతల్‌ సర్కిళ్లలో మాత్రం అధికారుల తనిఖీలు మచ్చుకైనా కన్పించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. జీడిమెట్ల, ఖాజిపల్లి, బాలానగర్‌, గాంధీనగర్‌ పారిశ్రామికవాడలోని పరిశ్రమలతో పాటు దినసరి కూలీలు, నగరంలోని పలు చోట్ల పనిచేసే నిరుపేదలు జీడిమెట్ల ప్రాంతంలో అధికంగా నివాస ముంటారు. అయితే పెద్దలైతే ఎంతైనా కొనుగోలు చేస్తామని, రోజువారిగా కిలో, రెండు కిలోల బియ్యం కొంటే కిలోకు రూ.100కు పైగా వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందని దినసరి కూలీలు తెలుపుతున్నారు.


సామాన్యుల జేబులకు చిల్లు..

జీడిమెట్ల సర్కిల్‌లోని ద్వారకాపురికాలనీ, మహేంద్రనగర్‌, కాకతీయ నగర్‌, మల్లికార్జుననగర్‌, డీనగర్‌, శ్రీనివాస్‌నగర్‌, చెరుకుపల్లికాలనీ, పద్మానగర్‌, చింతల్‌ సర్కిల్‌లోని చంద్రానగర్‌, సాయినగర్‌, రంగానగర్‌, చింతల్‌ మెయిన్‌రోడ్డులోని హోల్‌సేల్‌, రిటైల్‌ దుకాణాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలను బేఖాతరు చేస్తున్నారు. వ్యాపారులు ఒక సిండికేట్‌గా మారి పలానా బియ్యం ఇంత ధరకే విక్రయించాలని నిర్ణయించి అమ్ముతున్నారని తెలుస్తోంది. ప్రతి దుకాణంలో పట్టికలు ఏర్పాటు చేసి ధరలను ప్రతిరోజు నమోదు చేయాల్సి ఉండగా ఏ దుకాణంలోనూ ఈ నిబంధన ఉండదు. ఎల్‌నినో పేరుతో కృత్రిమ కొరత చూపుతూ బహిరంగ మార్కెట్‌లో కిలోబియ్యం రూ.110లకు విక్రయిస్తున్నారని వినియోగదారులు తెలుపుతున్నారు.


city6.2.jpgనగరంలోని పలుచోట్ల దాడులు చేస్తున్న అధికారులు అధిక జనాభా నివాసముండే కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో మాత్రం ఎందుకు చేయడంలేదని, వ్యాపారులతో అధికారులు కుమ్మక్కై నెలనెలా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రతి షాపులో పరిమితికి మించి అధిక నిల్వలు ఉన్నప్పటికీ ధరల పేరుతో దోచుకుంటు న్నారని తెలుస్తోంది. ఉదాహరణకు.. బీపీఈ(కేఎన్‌ఎన్‌), బీపీటీ(కేఎన్‌ఎం) బియ్యం రూ.66 నుంచి రూ.69లు, తెలంగాణ సోన రూ.74ల నుంచి రూ.76లకు, హెచ్‌ఎంటీ(జేఎస్‌ఆర్‌) రూ.79ల నుంచి రూ.81లు విక్రయిం చాల్సి ఉందని ప్రభుత్వ నిబంధనలున్నాయి. హెచ్‌ఎంటీ బియ్యాన్ని గజ రాజుగా, హెచ్‌ఎంటీ హంసలుగా పేరుపెట్టి కిలోకు రూ.88ల నుంచి రూ.110ల వరకు విక్రయిస్తున్నారు.


అంటే 25కిలోల గజరాజు బియ్యానికి రూ.2,750లు, క్వింటాలకు రూ.11వేలకు విక్రయిస్తున్నారని సమాచారం. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖాధికారులు మిన్నకుండిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత ఉన్నతాధికారులైనా స్పందించి బియ్యం సిండికేట్‌ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని నిరుపేద ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై బాలానగర్‌ సివిల్‌ సప్లై అధికారి కళ్యాణ్‌ను వివరణ కోరగా.. తాను బదిలీ అయ్యానన్నారు. ప్రస్తుతం ఎవరు వచ్చారో కూడా తెలియ దన్నారు. బదిలీ అయిన అధికారికి ఆయన స్థానంలో బదిలీపై వచ్చిన అధికారి తెలియదని చెప్పడం హాస్యాస్పదం.


ఈ వార్తలు కూడా చదవండి:

మహిళా కాంగ్రెస్‌.. రెండో జాబితా విడుదల

గంజాయి అక్రమ రవాణా నిందితుడిపై పీడీ యాక్ట్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 11:07 AM