గంజాయి అక్రమ రవాణా నిందితుడిపై పీడీ యాక్ట్
ABN , Publish Date - Nov 17 , 2026 | 06:48 AM
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడు ప్రశాంత్ గణేశ్ పసల్కర్ అలియాస్ నానాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు.
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడు ప్రశాంత్ గణేశ్ పసల్కర్ అలియాస్ నానాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. గతంలో 3 వేర్వేరు కేసుల్లో 254.236 కిలోల గంజాయితో పట్టుబడి జైలుకెళ్లిన ప్రశాంత్ గణేశ్ పసల్కర్.. బెయిలుపై బయటకొచ్చాక కూడా అదే దందా చేస్తున్నాడు.
దీంతో ఆయనపై ఎన్డీపీఎస్ చట్టం-1998లోని 3(1)వ సెక్షన్ ప్రకారం పీడీ యాక్ట్‌ను ప్రయోగించినట్లు చెప్పిన ఈగల్ ఫోర్స్ అధికారులు.. ప్రశాంత్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. గంజాయి సరఫరాదారులు, రవాణాదారులు, కొనుగోలు దారులతో సమన్వయం చేసుకోవడంలో మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట ముఠాలో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడని పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి
అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా
ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News