Share News

మహిళా కాంగ్రెస్‌.. రెండో జాబితా విడుదల

ABN , Publish Date - Nov 17 , 2026 | 06:50 AM

తెలంగాణ ప్రదేశ్‌ మహిళా కాంగ్రెస్‌ కమిటీ రెండోవిడత రాష్ట్ర కార్యవర్గంతో పాటు ఏడు జిల్లాల అధ్యక్షుల జాబితాను ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ప్రకటించారు.

మహిళా కాంగ్రెస్‌.. రెండో జాబితా విడుదల

హైదరాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):తెలంగాణ ప్రదేశ్‌ మహిళా కాంగ్రెస్‌ కమిటీ రెండోవిడత రాష్ట్ర కార్యవర్గంతో పాటు ఏడు జిల్లాల అధ్యక్షుల జాబితాను ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ప్రకటించారు. నూతన రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బడిగే ఇందిరా, పిన్నింటి కావ్య, శ్రీరెడ్డి, నాయిని రజిత నియమితులయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శులుగా సిరిపురం లావణ్య, దాచేపల్లి సారిక, దుంగ్రోతు నాగమణి, ఇరుకుల్ల మంగలకు అవకాశం కల్పించారు.


జిల్లాల అధ్యక్షుల విషయానికొస్తే నిర్మల్‌కు మేడారం అపర్ణ, జనగామకు వంగల కల్యాణి, ఆదిలాబాద్‌కు తుమ్మల అన్నపూర్ణ, కామారెడ్డికి ఆకుల కల్పన, ములుగుకు నాగమణి, వనపర్తికి శ్రీలతరెడ్డి, ఆసిఫాబాద్‌ జిల్లాకు సుప్రం అనితను నియమించారు. మిగిలిన జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల జాబితాను వారంలో ప్రకటిస్తామని స్వర్ణ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Updated Date - Nov 17 , 2026 | 06:50 AM