Share News

దూకుడే కొంపముంచిందా!?

ABN , Publish Date - Sep 04 , 2026 | 01:39 PM

రాజకీయాల్లో దూకుడు ఉండాలి... కానీ, ఆ దూకుడే దారి తప్పితే? ప్రత్యర్థులపై విరుచుకుపడే వాగ్ధాటి ఉండాలి.

దూకుడే కొంపముంచిందా!?
konda surekha

  • స్వయంకృతాపరాధంతో మంత్రి పదవి కోల్పోయిన కొండా సురేఖ

  • చిచ్చు రేపిన కుమార్తె సుస్మితాపటేల్‌ అనుచిత వ్యాఖ్యలు

  • సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన కామెంట్లతో నివ్వెరపోయిన పార్టీ

  • ఆమె మాటలను సురేఖ ఖండించక పోవడంతో ముదిరిన వివాదం

  • వరంగల్‌ నుంచి ఢిల్లీకి పంచాయితీ... హెచ్చరికల తర్వాత కూడా మారని వైఖరి

  • అధిష్ఠానం జోక్యంతో సురేఖను బర్తరఫ్‌ చేసిన ముఖ్యమంత్రి

  • ‘ఫైర్‌ బ్రాండ్‌’కు కలిసిరాని మంత్రి పదవులు

  • 2009లో ఐదు నెలలకు.. ఇప్పుడు 33 నెలలకు చేజారిన వైనం

  • 15 రోజుల సంక్షోభంలో సొంతపార్టీలో ఏ ఒక్కరి నుంచి దక్కని మద్దతు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్)

రాజకీయాల్లో దూకుడు ఉండాలి... కానీ, ఆ దూకుడే దారి తప్పితే? ప్రత్యర్థులపై విరుచుకుపడే వాగ్ధాటి ఉండాలి.. కానీ ఆ వాగ్ధాటి సొంత పార్టీ సరిహద్దులనే దాటిపోతే..? ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా పేరుపొంది కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలకమైన దేవాదాయ, అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది.


గురువా రం సురేఖ బర్తరఫ్‌ వెనుక విపక్షాల కుట్రలు లేవు.. అంతర్గత శత్రువుల వ్యూహాలు లేవు.. అది కేవలం సురేఖ, ఆమె కుటుంబం చేసుకు న్న స్వయంకృతపరాధమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా వారి కుమార్తె సుస్మిత రాజకీయ ప్రవేశంపై వచ్చిన వివాదం, దానికి కొనసాగింపుగా జరిగిన పరిణామాలు చివరికి సురేఖ రాజకీయ ప్రయాణంలో ఊహించని విధంగా కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ అయ్యే పరిస్థితిని తెచ్చిపె ట్టాయనే చర్చ జరుగుతోంది.


మంత్రిగా అనుహ్యమైన అవకాశం..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 12అసెంబ్లీ స్థానాల్లో 10చోట్ల కాంగ్రెస్‌ విజ యం సాధించింది. ములుగు నుంచి గెలిచిన సీతక్కతో పాటు బీసీ మహిళ అయిన కొండా సురేఖకు కూడా మంత్రిగా అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే రేవంత్‌రెడ్డితో సన్నిహితంగా ఉండటం సురే ఖకు కలిసి వచ్చింది. 2014లో బీఆర్‌ఎస్‌లో చేరిన సురేఖ పరకాల టికెట్‌ కావాలని అడిగితే.. వరంగల్‌ తూర్పు టికెట్‌ ఇచ్చారు. అయినప్పటికి 50వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.


సీనియర్‌ ఎమ్మెల్యేగా, బీసీ మహిళగా ఉన్న సురేఖకు అప్పటి ప్రభుత్వం లో కేసీఆర్‌ మంత్రిగా అవకాశం ఇవ్వలేదు. 2018లో తిరిగి కాంగ్రెస్‌లో చేరినన సురేఖ పరకాలలో ఓడిపోయినప్పటికి, 2023లో వరం గల్‌తూర్పుకు కాంగ్రెస్‌ టికెట్‌ను రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కేటాయించారు. గెలిచిన తరువాత మంత్రిగా తన కేబినెట్‌లోకి తీసు కున్నారు. దేవాదాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రిగా సురేఖకు సముచిత స్థానం కల్పిం చారు. తొలుత సీఎంతో సన్నిహితంగా ఉంటూ వచ్చిన కొండా దంపతుల్లో అను హ్యంగా వచ్చిన మార్పు, దూకుడు తత్వం సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రు లకు కూడా దూరం చేసిందనే టాక్‌ వినబడుతోంది.


ఎసరు తెచ్చిన సుస్మిత మాటలు

కొండా దంపతులు తమ కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. 2014లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా సురేఖ కొనసాగిన సమయంలోనే సుస్మిత వంచనగిరి పీఏసీఎస్‌ చైర్మన్‌గా కొనసాగారు. ఆ సమయంలోనే సుస్మితను డీసీసీబీ చైర్మన్‌గా చేయాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌లో చేరిన సురేఖ తనకు వరంగల్‌ తూర్పు టికెట్‌, తన కుమా ర్తెకు పరకాల లేదా భూపాలపల్లి నుంచి పోటీకి అవకాశం కల్పించాలని కోరారు. అయితే అధిష్ఠానం పరకాల మాత్రమే సురేఖకు కేటాయించింది.


zzz.jpg2024లో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనూహ్యంగా తన కుమార్తె కడియం కావ్యను రాజకీయాల్లోకి తీసుకరావడమే కాకుండా వరంగల్‌ ఎంపీగా గెలిపించుకోవడం కొండా దంపతుల్లో తమ కుమార్తె రాజకీయ ప్రవేశంపై పట్టుదల పెరిగిందనే చర్చ జరుగుతుంది. పరకాల టికెట్‌పై ఆశతోనే ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో విభేదాలు ఏర్పడుతున్నాయనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో అగస్టు 16న సీఎం రేవంత్‌రెడ్డి పరకాల బహిరంగ సభలో మళ్లీ రేవూరి ప్రకా్‌షరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల ని కోరారు. సీఎం ప్రకటన కొండా ఫ్యామిలీలో తీవ్ర అసహనాని కి దారితీసిందనే చర్చజరుగుతుంది. ఈనేపథ్యంలో ఆగస్టు 19న కొండా సురేఖ జన్మదినం సందర్భంగా గీసుకొండలోజరిగిన సభ లో సుస్మిత సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.


దీంతో కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ఆగస్టు 20న సురేఖకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. సుస్మిత వ్యాఖ్యలకు తనకు సంబం ధం లేదని, అవి ఆమె వ్యక్తిగతమని సురేఖ స్పష్టం చేశారు. 22వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను బెంగుళూరులో కలిసి సురేఖ వివరణ ఇచ్చారు. అయితే క్రమశిక్షణ సం ఘం హైకమాండ్‌ దృష్టికి సుస్మిత వ్యాఖ్యలు, సురేఖ సమాధా నం వెళ్లడంతో అధిష్టానం సీరియ్‌సగా తీసుకుంది. ఈ క్రమంలోనే సురేఖ మంత్రి పదవిని కోల్పోయింది. కుమార్తె చేసిన అనుచిత వ్యాఖ్యలు తల్లి మంత్రి పదవికి ఎసరు తెచ్చాయనే చర్చ జరుగుతుంది.


కుడా పదవితో బీసీ లెక్క

బీసీ కార్డుతో సురేఖ చేస్తున్న రాజకీయ ఫైట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహత్మకంగా చెక్‌ పెట్టారనే చర్చ జరుగుతుంది. తాను పద్మశాలి, తన భర్త మురళీ మున్నూరుకాపు అని, తమ సామాజిక వర్గాలు 16 శాతం ఉన్నాయని సురేఖ పలుమార్లు ప్రస్తావించారు. దీంతో మాజీ రాజ్యసభ సభ్యురాలు, జీడబ్ల్యుఎంసీ తాజా మాజీ మేయర్‌ గుండు సుధారాణికి కుడా చైర్మన్‌ పదవిని ప్రభుత్వం అప్పగించింది. సురేఖ సామాజిక వర్గమైన పద్మశాలి కులానికి చెందిన సుధారాణికి కుడా చైర్మన్‌ పదవి ఇవ్వడంతో ఆ కులస్థులను శాంతింప చేశారనే టాక్‌ వినబడుతుంది. అలాగే మున్నూరుకాపు, గౌడ కులాలకు చెందిన విజయలక్ష్మి, నేరేళ్ల శారదలకు కూడా నామినేటెడ్‌ పదవులను సీఎం కట్టబెట్టి బీసీ కులాలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని, సురేఖ ఆరోపణలకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేశారనే చర్చ జరుగుతుంది.


వ్యాఖ్యలూ.. వివాదాలూ...

సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా ఉన్న కొండా సురేఖ తన వివాదాస్పద వ్యాఖ్యలు, పనుల తో వార్తల్లోకి ఎక్కుతూ వచ్చారు. ప్రధానంగా 2024 అక్టోబరు 2న సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపైన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సమంత, నాగచైతన్యల విడాకులకు బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ బాధ్యుడంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపా యి. దీనిపై కోర్టులో నాగార్జున కేసులు వేశారు. కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తుందని గ్రహించిన కొండా సురేఖ 2025 నవంబరు 12న ఎక్స్‌లో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ, తాను చేసి వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయడంతో నాగార్జున పెద్ద మనస్సుతో కేసు ఉపసంహరించుకున్నారు.


zzzz.jpg

  • 2024 అక్టోబరు 13న రాత్రి వరంగల్‌జిల్లా గీసుకొండ పోలీస్‏స్టేషన్‌ ఎదుట మంత్రిహోదాలో కొండా సురేఖ తన అనుచరులతో కలిసి ధర్నా నిర్వహించా రు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకా్‌షరెడ్డి, కొండా అనుచరుల మధ్య దసరా వేడుకల ఫ్లెక్సీల విషయంలో జరిగిన ఘర్షణకు సంబంధించి తమ అనుచరులను వదిలేయాలని ఏకంగా మంత్రి ధర్నాకు దిగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


  • 2024 మే 8వ తేదీన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‏రెడ్డితో మంత్రి సురేఖ జరిగిన వివాదస్పద ఫోన్‌కాల్‌ అడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. పరకాల విషయంలో మంత్రి, ఎమ్మెల్యే ఒకరినొకరు హెచ్చరించుకుం టూ జరిగిన సంభాషణ తీవ్ర దుమా రం రేగింది.

  • 2025 జూన్‌ 19న రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి... పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‏రెడ్డి, కడియం శ్రీహరిలపై చేసిన వ్యక్తిగత విమర్శలు రాజకీయాల్లో హట్‌టాపిక్‌గా మా రాయి. వరంగల్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఇదే అంశంపై కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేసినప్పటికీ విభేదాలు మాత్రం కొనసాగుతూ వచ్చాయి.


  • 2025 సెప్టెంబరు-అక్టోబరులో మేడారం మహజాతరకు సంబంధించి న అభివృద్ధి పనుల విషయంలోనూ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సురేఖకు విభేదా లు ఏర్పడ్డాయి. దీంతో దేవాదాయశాఖ పరిధిలోని పనులను ఆర్‌అండ్‌బీ శాఖ కు ప్రభుత్వం మార్చేసింది. అంతేకాకుండా మేడారం జాతర అభివృద్ధి పనులకు కూడా సురేఖ దూరం గా ఉంటూ వచ్చారు.


  • 2025 అక్టోబరు 15న రాత్రి సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను ప్రభుత్వం తొలగించింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని సురేఖ నివాసం నుంచి పోలీసులు సుమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేయగా, సురేఖ తన అధికారిక కారులో సుమంత్‌ను అక్కడి నుంచి తరలించారనే ఆరోపణ లు ఉన్నాయి. ఇదే విషయమై సురేఖ కుమార్తె సుస్మిత... సీఎం రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, వేం నరేందర్‌రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపాయి.


ఈ వివాదాల నేపథ్యంలో 2026 మే 14న వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయి ని రాజేందర్‌రెడ్డి క్యాంపు కార్యాలయం లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ, మేయర్‌ తదితర కీలక నేతలు కొండా సురేఖతో కలిసి విందు చేశారు. ఇక వివాదాల జోలికి వెళ్లకుం డా కలిసి పనిచేయాలని, అలాగే రాజ్యసభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని మే 24న సన్మానం చేయాలని తీర్మానిం చి, సన్మానం కూడా చేశారు. తాజా వివాదంలో ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా సురేఖకు మద్దతుగా లేకపోవడంచర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఘాటెక్కిన ఉల్లి.. నెల రోజుల్లోనే ఆకాశాన్నంటిన ధరలు

పదవి ఉన్నా లేకున్నా నా గౌరవం నాకుంది

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 01:39 PM