Share News

భారతీయులున్న నౌకపై డ్రోన్ దాడి.. పాక్‌కు వెళుతుండగా..

ABN , Publish Date - Sep 04 , 2026 | 01:02 PM

రష్యా నుంచి పాక్ వెళుతున్న ఓ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఘటన సమయంలో నౌకలో 23 మంది భారతీయులు కూడా ఉన్నారు. వారంతా క్షేమంగానే ఉన్నట్టు తెలిసింది.

భారతీయులున్న నౌకపై డ్రోన్ దాడి.. పాక్‌కు వెళుతుండగా..
Drone Attack on MV BARYON

ఇంటర్నెట్ డెస్క్: రష్యా నుంచి పాక్ వెళుతున్న ఓ నౌకపై డ్రోన్ దాడి (Drone Attack) జరిగింది. ఘటన సమయంలో నౌకలో 23 మంది భారతీయులు కూడా ఉన్నారు. వారంతా క్షేమంగానే ఉన్నట్టు తెలిసింది. నోవోరోస్సిస్క్ పోర్టు నుంచి కరాచీకి వెళుతున్న MV BARYON నౌకపై సెప్టెంబర్ 2న ఈ దాడి జరిగింది.

సిబ్బంది కంపార్ట్‌మెంట్లు ఉండే భాగాన్ని డ్రోన్ ఢీకొంది. ఈ క్రమంలో మంటలు చెలరేగినప్పటికీ వేగంగా స్పందించిన సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతరం నౌక యథాప్రకారం ముందుకు సాగిపోయినట్టు తెలిసింది. దాడి సమయంలో నౌక సమీపంలో మరో డ్రోన్ కనిపించినట్టు కూడా వార్తలు వచ్చాయి. హోర్ముజ్ సమీపంలో ఈ డ్రోన్ దాడి జరిగిందా? లేక మరో ప్రాంతంలోనా? అనే విషయంలో కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


యూఎస్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కీలక జలమార్గాల్లో కమర్షియల్ నౌకలపై దాడులు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో, నౌకల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ప్రపంచవాణిజ్యానికి హోర్ముజ్ జలసంధి కీలకం కావడంతో ఉద్రిక్తతలు మరింత ముదిరితే పరిస్థితి చేయి దాటవచ్చన్న ఆందోళనలు ఉన్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

భారత కంపెనీతో డీల్‌లో అవకతవకలు.. ఎస్తోనియా మంత్రి రాజీనామా

ముప్పు అంచున యూకే.. ట్రంప్ హెచ్చరిక

Updated Date - Sep 04 , 2026 | 01:13 PM