ముప్పు అంచున యూకే.. ట్రంప్ హెచ్చరిక
ABN , Publish Date - Sep 04 , 2026 | 10:27 AM
వలసలు, అధిక ఇంధన ధరల కారణంగా యూకే వైపు ముప్పు ముంచుకొస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: వలసలు, అధిక ఇంధన ధరల కారణంగా యూకే వైపు ముప్పు ముంచుకొస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. యూకే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ముప్పుగా మారుతున్నాయని చెప్పుకొచ్చారు. స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు.
తనకు బ్రిటన్ అన్నా, రాజు చార్ల్స్ అన్నా ఎంతో అభిమానమని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే, బ్రిటన్ ప్రభుత్వం పలు సవాళ్లను అధిగమించాల్సి ఉందని హెచ్చరించారు. ‘మీ దేశం సమస్యల్లో ఉంది. ముప్పు అంచున ఉంది. మీ దేశంలో వలసల సమస్య ఎక్కువ. ఇంధన ధరలు ఇతర దేశాలతో పోలిస్తే మూడు నాలుగు రెట్లు ఎక్కువ’ అని అన్నారు. ‘ప్రపంచం నలువైపుల నుంచి మీ దేశంలోకి వస్తున్న వలసలను అడ్డుకోకపోతే మీకంటూ దేశమే మిగలదు’ అని బ్రిటన్ పాలకులను ట్రంప్ హెచ్చరించారు.
శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనాలవైపు మళ్లిన బ్రిటన్‌ను ఇప్పటికే ట్రంప్ పలుమార్లు విమర్శించారు. ఉత్తర సముద్రంలోని ముడిచమురు, సహజవాయువు వనరుల అన్వేషణకు ప్రయత్నించాలని బ్రిటన్ పాలకులకు సూచించారు. ఈ ప్రతిపాదన బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, సముద్రమార్గంలో బ్రిటన్‌లోకి అక్రమ వలసలను ప్రేరేపించే క్రిమినల్ గ్యాంగ్స్‌పై గట్టి చర్యలు తీసుకుంటున్నామని కూడా బర్న్‌హ్యామ్ ప్రభుత్వం ఇటీవల తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్‌లో పెళ్లింటిపై దాడి ఘటన.. దర్యాప్తు చేస్తున్నాం: జేడీ వాన్స్
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత!