ఇరాన్‌లో పెళ్లింటిపై దాడి ఘటన.. దర్యాప్తు చేస్తున్నాం: జేడీ వాన్స్
ABN , Publish Date - Sep 04 , 2026 | 08:03 AM
ఇరాన్‌లో పెళ్లింటిపై జరిగిన దాడిలో పలువురు మరణించారు. అమెరికా దాడితో వీరు మరణించినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల దక్షిణ ఇరాన్‌లో పెళ్లి వేడుక జరుగుతున్న ఓ ఒంటిపై జరిగిన దాడిలో నలుగురు మరణించారు. మరో 68 మంది గాయపడ్డారు. అమెరికా దాడితోనే పెళ్లింట విషాదం నెలకొందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై గురువారం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ‘మేము దర్యాప్తు చేస్తున్నాము. అసలేం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నాము’ అని వాన్స్ అన్నారు. ఘటనపై మీడియాలో వార్తలు తమ దృష్టికి వచ్చాయని యూఎస్ మిలిటరీ కూడా పేర్కొంది. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. అంతకుముందు, యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి మాట్లాడుతూ తమకు ఇరాన్ దళాల వలె సామాన్యులను టార్గెట్ చేసే అలవాటు లేదని ఘాటుగా జవాబిచ్చారు.
మంగళవారం ఇరాన్‌లో ఖుహెస్టక్ టౌన్‌లో ఈ దాడి జరిగింది. ఇరాన్‌కు చెందిన ప్రత్యేక సైనిక దళం ఐఆర్‌జీసీని యూఎస్ సెంట్రల్ కమాండ్ మంగళవారం టార్గెట్ చేసింది. ఐఆర్‌సీజీకి చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ వ్యవస్థలు, ఆయుధ నిల్వ కేంద్రాలపై దాడులు చేసింది. అయితే, అమెరికా చేసిన ఈ దాడుల్లో స్థానికంగా ఓ పెళ్లింట పలువురు మరణించారని ఇరాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మరోవైపు, నేరుగా జరిగిన దాడిలోనే పెళ్లింట పలువురు మరణించారని నిపుణులు నిర్ధారణకు వచ్చినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సమీపంలో జరిగిన దాడికి సంబంధించిన శకలాలు తగలండంతోనే వారు కన్నుమూశారన్న వాదనను నిపుణులు తోసిపుచ్చినట్టు సమాచారం.
ఈ వార్తలనూ చదవండి:
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత!
టిబెట్‌లో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 5.0గా తీవ్రత నమోదు