టిబెట్‌లో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 5.0గా తీవ్రత నమోదు
ABN , Publish Date - Sep 03 , 2026 | 02:43 PM
టిబెట్‌లో ఇటీవల ఓ హిమానీనదం కూలిపోవడం వల్ల ఆగస్టు 26న భారీ వరదలు సంభవించిన ఘటన మరవకముందే.. భారీ భూప్రకంపనలు సంభవించాయి.
ఇంటర్నెట్ డెస్క్: టిబెట్‌లో ఇటీవల ఓ హిమానీనదం కూలిపోవడం వల్ల ఆకస్మిక వరదలు సంభవించిన ఘటన మరవకముందే.. భారీ భూప్రకంపనలు సంభవించాయి. గురువారం మధ్యాహ్నం వేళ సంభవించగా.. రిక్టర్ స్కేలుపై 5.0గా తీవ్రత నమోదైనట్టు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్(జీఎఫ్‌జెడ్) అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని.. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదనీ స్పష్టం చేశారు.
కాగా.. నేపాల్ సరిహద్దు సమీపంలోని టిబెట్‌లో గత ఆగస్టు 26న ఓ హిమానీనదం కూలిపోవడం వల్ల భారీ వరదలు సంభవించాయి. ఫలితంగా చాలా పట్టణాలు, లోయలు అతలాకుతలమవడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు.
ఇవీ చదవండి:
హోర్ముజ్ జలసంధి పేరు మార్చేస్తే పోలా.. డొనాల్డ్ ట్రంప్ కామెంట్
‘టైమ్స్ స్క్వేర్’లో కత్తులతో దాడి.. బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్‌ప్రెసిడెంట్ మృతి