Share News

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ABN , Publish Date - Sep 04 , 2026 | 09:27 AM

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేరుతో ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది.

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, సెప్టెంబర్ 04: కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేరుతో ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జి.ఓ.ఎం.ఎస్.నం.128ను శాఖ జారీ చేసింది. ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. కొండా సురేఖ ఇకపై మంత్రిగా కొనసాగరని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు వివరించింది. తెలంగాణ గెజిట్ ప్రత్యేక సంచికలో ఈ నోటిఫికేషన్ ప్రచురించాలని స్పష్టం చేసింది.


కొండ సురేఖ జన్మదినం సందర్భంగా వరంగల్ జిల్లాలోని గీసుకొండలో ఆమె అభిమానులు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొండ సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పరకాల అసెంబ్లీ స్థానం, సీఎం రేవంత్ రెడ్డిపై పలు వ్యాఖ్యలు చేసింది. అవి వైరల్ అయినాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పార్టీ క్రమశిక్షణ కమిటీ స్పందించింది. కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సదరు కమిటీకి రెండు లేఖల ద్వారా కొండా సురేఖ వివరణ ఇచ్చింది.


ఈ అంశంపై క్రమశిక్షణ కమిటీ రూపొందించిన నివేదికను పార్టీ అధిష్ఠానానికి పీసీసీ చీఫ్ అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా కొండా సురేఖపై అధిష్ఠానం చర్యలు తీసుకుంది. దీంతో కొండా సురేఖను రేవంత్ రెడ్డి క్యాబినెట్ నుంచి తొలగించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. మరో వైపు గురువారం సాయంత్రం తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ అంశంపై ఆయనతో సీఎం చర్చించారు. అనంతరం తెలంగాణ గవర్నర్ కార్యాలయం ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు

ఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ నారాయణన్

For More TG News And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 09:43 AM