‘బిగ్ అప్డేట్ కమింగ్ సూన్’.. కొండా సురేఖ పోస్ట్ వైరల్
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:49 PM
ఫేస్‌బుక్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘ది వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్’ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 4: మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత ఫేస్‌బుక్ వేదికగా మాజీ మంత్రి కొండా సురేఖ పెట్టిన తాజా పోస్ట్ వైరల్‌గా మారింది. ‘బిగ్ అప్డేట్ కమింగ్ సూన్’ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణలో కొండా సురేఖ బర్తరఫ్ అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కొండా సురేఖ బర్తరఫ్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోద ముద్ర వేయగా.. సిఫారసు లేఖను గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి పంపించారు. ఈ మేరకు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ పేరుతో గెటిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. బర్తరఫ్ తర్వాత కొండా సురేఖ భవితవ్యంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో సురేఖ పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ‘ది వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. ఏ బిగ్ అప్డేట్ కమింగ్ సూన్. స్టే ట్యూన్ తెలంగాణ’ అంటూ ఫేస్‌బుక్‌లో కొండా సురేఖ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అనంతరం నిన్న(గురువారం) మీడియాతో మాట్లాడిన సురేఖ.. కాంగ్రెస్ పార్టీని వీడనని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్‌తో.. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా? లేదా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా పార్టీలో కొనసాగడంపై కొండా కుటుంబం సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి కేడర్‌తో కొండా ఫ్యామిలీ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో కొనసాగడంపై కొండా సురేఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి...
సీజ్ చేసిన సిగరెట్ల విక్రయం.. భాకరాపేట ఎఫ్‌ఆర్‌ఓ సస్పెన్షన్
తెలంగాణలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. ఇస్కాన్ ఆలయాల్లో భక్తుల రద్దీ
Read Latest Telangana News And Telugu News