దారుణం.. అనుమానంతో భార్యపై విచక్షణారహితంగా..
ABN , Publish Date - Sep 04 , 2026 | 11:17 AM
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై భర్త విచక్షణారహితంగా దాడి చేశాడు. జిల్లాలోని తుణుకు పాతవూరు ఇరగవరం కాలనీలో ఈ ఘటన జరిగింది.
పశ్చిమగోదావరి, సెప్టెంబర్ 4: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై భర్త విచక్షణారహితంగా దాడి చేశాడు. జిల్లాలోని తుణుకు పాతవూరు ఇరగవరం కాలనీలో ఈ ఘటన జరిగింది. దుర్గప్రసాద్ అనే వ్యక్తి భార్య భవానితో కలిసి ఇరగవరం కాలనీలో నివాసం ఉంటున్నాడు. విహహం అయినప్పటి నుంచీ భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెతో తరచూ గొడవలు పడుతూ ఉండేవాడని సమాచారం. గత రాత్రి కూడా ఇరువురి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో దుర్గప్రసాద్.. భార్యపై అతికిరాతకంగా దాడి చేశాడు.
దీంతో భవాని తీవ్ర గాయాలపాలైంది. భర్త చేతిలో గాయపడ్డ భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భవానిని పరీక్షించిన వైద్యులు.. పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రిలో భవానికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. కట్టుకున్న భార్యపై భర్త దాడి ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి...
ఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ నారాయణన్
సీజ్ చేసిన సిగరెట్ల విక్రయం.. భాకరాపేట ఎఫ్‌ఆర్‌ఓ సస్పెన్షన్
Read Latest AP News And Telugu News