సీజ్ చేసిన సిగరెట్ల విక్రయం.. భాకరాపేట ఎఫ్‌ఆర్‌ఓ సస్పెన్షన్
ABN , Publish Date - Sep 04 , 2026 | 09:28 AM
అటవీ చెక్‌పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్న సిగరెట్ల నిల్వలను విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో భాకరాపేట అటవీ క్షేత్రాధికారి(FRO) ఎన్. వెంకటరమణపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
తిరుపతి, సెప్టెంబర్ 4: చెక్‌పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్న సిగరెట్ల నిల్వలను విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో భాకరాపేట అటవీ క్షేత్రాధికారి(FRO) ఎన్. వెంకటరమణపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారి చలపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ చెక్‌పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్న సిగరెట్ల నిల్వలను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి అవినీతికి పాల్పడ్డారని ఎఫ్‌ఆర్‌వోపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు జీవకోనకు చెందిన జి.మునిగోపాల్ చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
తిరుపతి నుంచి రాయచోటికి తరలిస్తున్న రూ.యాబై లక్షల విలువైన సిగరెట్లను సీజ్ చేసిన ఎఫ్‌ఆర్‌ఓ వెంకటరమణ.. ఆపై వాటిని వేరే వారికి విక్రయించినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఆర్‌వోపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వుల జారీ చేశారు.
మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా భాకరాపేట రేంజ్ ఆఫీసులో సేఫ్ కస్టడీలో ఉన్న ఏనుగు దంతాలు, ఒక తుపాకీ చోరీకి గురవడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇంటి దొంగల పనే అని ప్రచారంలో ఉన్నప్పటికీ అప్పట్లో పోలీసులకు అటవీశాఖ అధికారులు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి. చోరీ జరిగి ఐదేళ్లు అవుతున్నా కూడా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేని వైనం తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇవి కూడా చదవండి...
పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు
ఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ నారాయణన్
Read Latest AP News And Telugu News