Share News

చాహల్ స్టన్నింగ్ డెలివరీకి బిత్తరపోయిన బెన్ స్టోక్స్... వీడియో

ABN , Publish Date - Sep 04 , 2026 | 08:24 AM

టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. నార్తాంప్టన్‌షైర్ తరఫున ఆడుతూ చాహల్.. డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో మ్యాజిక్ చేసి బెన్ స్టోక్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

చాహల్ స్టన్నింగ్ డెలివరీకి బిత్తరపోయిన బెన్ స్టోక్స్... వీడియో

స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్‌లో బ్యాటర్లే కాకుండా బౌలర్లు సైతం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. వికెట్ పడిన కొన్ని సందర్భాల్లో అయితే ప్రేక్షకులతో పాటు బ్యాటర్లు సైతం బిత్తరపోతుంటారు. తాజాగా టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా అలానే అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. చాహల్ తనదైన శైలీలో మ్యాజిక్ బాల్ వేసి వికెట్ తీసుకున్నాడు. దీంతో ప్రత్యర్థి బ్యాటర్ ఔటవ్వడమే కాకుండా.. కాసేపు షాక్‌లోనే ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో యుజ్వేంద్ర చాహల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. నార్తాంప్టన్‌షైర్, డర్హామ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు సాధించాడు. నార్తాంప్టన్‌షైర్ తరఫున ఆడిన ఈ లెగ్ స్పిన్నర్ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. చాహల్ స్టన్నింగ్ డెలివరీతో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను బోల్తా కొట్టించాడు. చాహల్ వేసిన బంతి ఆఫ్ సైడ్ నుంచి రెప్పపాటు సమయంలో ఇన్‌సైడ్ టర్న్ తీసుకుని వికెట్లను గిరాటేసింది. దీంతో కాసేపు అసలు తాను ఎలా ఔట్ అయ్యానో కూడా అర్థంకాక స్టోక్స్ షాక్‪లో ఉండిపోయాడు.


ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 36 పరుగులే ఇచ్చిన చాహల్ నాలుగు వికెట్లు తీశాడు. ఈ టీమిండియా స్పిన్నర్ పడగొట్టిన వికెట్లలో అలెక్స్ లీస్, బెన్ స్టోక్స్, కేసీ ఆల్‌డ్రిజ్, మాథ్యూ పాట్స్ ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డర్హామ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 56.2 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నార్తాంప్టన్‌షైర్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది.


దీంతో ప్రస్తుతం 20 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నార్తాంప్టన్‌షైర్ జట్టు ఉంది. 2026 సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు నార్తాంప్టన్‌షైర్, డర్హామ్ జట్ల మధ్య కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-2 మ్యాచ్ జరుగుతోంది. ఈ లీగ్‌లో చాహల్‌తో పాటు కుల్దీప్ యాదవ్ , అఖిబ్ నబీ, రాహుల్ చాహర్ వంటి పలువురు టీమిండియా ప్లేయర్లు ఆడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

నిప్పులు చెరిగిన భువి.. సెలక్టర్లకు అగ్నిపరీక్ష!

‘ఇంపాక్ట్‌’గా ధోనీ విముఖత

Updated Date - Sep 04 , 2026 | 08:30 AM