జనగామలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Jul 24 , 2026 | 09:15 AM
జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బమ్మెర శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
జనగామ జిల్లా, జులై 24 (ఆంధ్రజ్యోతి): జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బమ్మెర శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మృతులను నర్సింగపురం తండాకు చెందిన కేతావత్ నరేందర్, బాదావత్ తిరుపతిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే ఇద్దరు యువకులు మృతి చెందినట్లుగా స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది? అనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఉదయ్ కృష్ణారెడ్డి కేసు.. మహిళా ట్రైనీ ఐపీఎస్ స్టేట్‌మెంట్ రికార్డ్
విద్యార్థులపై లాఠీఛార్జ్ కాదు.. కేంద్రం సమాధానమివ్వాలి: కమల్ హాసన్
రాష్ట్రాలను నమ్మండి.. నీట్‌ను రద్దు చేయండి: స్టాలిన్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News