Share News

ఇందిరమ్మ బీమాలో మార్పులు

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:21 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో మార్పులు జరగనున్నాయి. ముందస్తుగా అనుకున్న ప్రకారం గ్రామాల్లో క్యాంపుల నిర్వహణ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం స్వస్తి పలికింది.

ఇందిరమ్మ బీమాలో మార్పులు
Indiramma Bima Scheme

  • ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయం

  • వెబ్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా అప్లికేషన్లు

  • క్యాంపుల్లోనే నమోదు చేయనున్న అధికారులు

  • రేషన్‌ కార్డు ఉంటనే పథకం వర్తింపు..

జనగామ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో మార్పులు జరగనున్నాయి. ముందస్తుగా అనుకున్న ప్రకారం గ్రామాల్లో క్యాంపుల నిర్వహణ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. వాస్త వంగా గురువారం జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో క్యాంపులను ఏర్పాటు చేసిన ఇందిర కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. కానీ.. అనూహ్యంగా ఈ ప్రక్రియను నిలిపివేస్తూ పలు మార్పులతో అధికారులు అత్యవసర మార్గదర్శకాలను విడుదల చేశారు. ముందస్తుగా ప్రింట్‌ చేసిన దరఖాస్తులను అందించి బీమా ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా ఆ ఆలోచనను అధికారులు మానుకున్నారు. క్యాంపుల్లోనే వెబ్‌, మొబై ల్‌ అప్లికేషన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీక రించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా గురువారం నిర్వహించాల్సిన అన్ని క్యాంపులను ఉన్న తాధికారులు నిలిపివేశారు. శుక్రవారం నుంచి ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసే క్యాంపుల్లో అధికారులు బీమా దరఖాస్తుల ప్రక్రియను చేపట్టనున్నారు. దశల వారీగా ఈ పథకం అమలును చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.


ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు

ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం నిర్వహించాల్సిన క్యాంపులను రద్దు చేయ డంతోపాటు పలు మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. దరఖా స్తుల స్వీకరణ కోసం ప్రభుత్వం వెబ్‌ అప్లికేషన్‌ తోపాటు మొబైల్‌ అప్లికేషన్‌ను కూడా రూపొంది స్తోంది. మొబైల్‌ అప్లికేషన్‌(యాప్‌) గురువారం సా యంత్రానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండ గా వెబ్‌ అప్లికేషన్‌ శుక్రవారం నుంచి అందుబాటు లోకి రానుంది. మొబైల్‌ యాప్‌తో పాటు ఆన్‌లైన్‌ సెంటర్లు, మీ సేవా కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకు నే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో ఏర్పా టు చేసే క్యాంపుల్లో నియమించిన పంచాయతీ కార్య దర్శులు, ఇతర సిబ్బంది వెబ్‌, మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా రేషన్‌ కార్డు నంబరుతో బీమా దరఖాస్తును పూర్తి చేయనున్నారు. రేషన్‌కార్డు నంబరుతో అప్లికేష న్‌లోకి వెళ్లగానే కుటుంబ సభ్యుల వివరాలు కనిపి స్తాయి. తర్వాత బీమాదారుడి పేరు, నామినీ పేర్లపై టిక్‌ చేయగానే ప్రాసెస్‌ పూర్తి కానుంది.


ఈ క్రమం లో ఎలాంటి పత్రాలు స్కాన్‌ చేయడం గానీ, ప్రింట్‌ చేసి సంతకం చేయించడం గానీ అవస రం లేదని అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అనంతరం దరఖాస్తుదారుడి మొబైల్‌కు మెసేజ్‌ రూపంలో సమాచారం వెళ్తుంది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ముందస్తుగా అనుకున్న ప్రకారం గురువారం క్యాంపుల నిర్వహణను శుక్రవారానికి అధికారులు వాయిదా వేశారు. జిల్లావ్యాప్తంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ మునిసిపాలిటీలోని 48 వార్డులు, 282 గ్రామ పంచాయతీల్లో శుక్రవారం నుంచి క్యాం పులు నిర్వహించనున్నారు.


రేషన్‌ కార్డు ఉంటేనే అర్హులు..

బీమా పథకం అమలులో ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. రేషన్‌ కార్డు, పేద, ధనిక తేడా లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతీ కుటుంబానికి ఈ బీమా పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం భావించింది. కానీ.. ప్రస్తుతం రేషన్‌ కార్డు ఉన్న వారికి మాత్రమే దరఖాస్తు చేసుకునేలా వెబ్‌, మొబైల్‌ అప్లికేషన్‌లో మార్పులు చేస్తున్నారు. రేషన్‌ కార్డు లేని వారు కొత్తగా కార్డు వచ్చిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని సూచనలు కూడా చేయనున్నారు. రేషన్‌ కార్డు లేకుండా దరఖాస్తు చేసుకోకుండా అప్లికేషన్‌లో మార్పులు చేయనుంది. దీనితో పాటు కుటుంబంలో ఎవరైనా గతంలో ప్రభుత్వం అమలు చేసిన ఏదైనా బీమా పథకం పరిధిలో ఉన్నారా అనే వివరాలను కూడా తెలుసుకునేందుకు అదనపు ప్రశ్నను జోడించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం, వెండి ధరల భారీ పతనం..

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 11:24 AM