మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు
ABN , Publish Date - Nov 20 , 2026 | 11:02 AM
ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈరోజు ఉదయమే ఈడీ అధికారుల బృందం రేఖా నివాసానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
నిర్మల్, నవంబర్ 20: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈరోజు(శుక్రవారం) ఉదయమే ఈడీ అధికారుల బృందం రేఖా నివాసానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. సీఎంఆర్ ధాన్యం డబ్బులు చెల్లింపుల్లో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సీఆర్పీఎఫ్ భద్రత మధ్య సోదాలు కొనసాగుతున్నాయి. రూ.40.96 కోట్ల విలువైన 6,393 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం చేసినట్టు ఆగస్టులో కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.
రేఖా నాయక్‌కు సంబంధించిన రైస్ మిల్లుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. సోదాల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఇంట్లో బీరువాలు తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. కీస్ లేవని చెప్పడంతో వాటిని తెరిచేందుకు వెల్డర్‌ను ఈడీ బృందం పిలిపించింది. దాదాపు నాలుగు గంటలుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రేఖా నాయక్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతుండటంతో ఆమె నివాసం వద్దకు అనుచరులు భారీగా చేరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి...
గోపాల్పూర్ సమీపంలో తీరం దాటిన ‘అక్వాన్’ తుపాను.. 90 కి.మీ. వేగంతో గాలులు
హైదరాబాద్‌లో రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. పలువురికి గాయాలు
Read Latest Telangana News And Telugu News