Share News

గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటిన ‘అక్వాన్’ తుపాను.. 90 కి.మీ. వేగంతో గాలులు

ABN , Publish Date - Nov 20 , 2026 | 09:49 AM

ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో అక్వాన్ తుపాను తీరం దాటింది. ఈరోజు ఉదయం 7:30 నుంచి 8:30 గంటల మధ్య తుపాన్ తీరం దాటినట్లు ఏపీఎస్‌డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు.

గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటిన ‘అక్వాన్’ తుపాను.. 90 కి.మీ. వేగంతో గాలులు
Cyclone Aqwan

అమరావతి, నవంబర్ 20: ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో అక్వాన్ తుపాను తీరం దాటింది. ఈరోజు (శుక్రవారం) ఉదయం 7:30 నుంచి 8:30 గంటల మధ్య తుపాను తీరం దాటినట్లు ఏపీఎస్‌డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచినట్లు తెలిపారు. తుపాను పూర్తిగా తీరం దాటేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.


తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను తీరం దాటినా శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలో మార్పు

మూడో విడత సమరానికి సై

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 10:07 AM