Share News

కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలో మార్పు

ABN , Publish Date - Nov 20 , 2026 | 05:52 AM

జిల్లా ప్రజాపరిషత్‌లలో కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలను ఇకమీదట అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాతే నిర్వహిస్తారు.

కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలో మార్పు

  • జిల్లా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల తర్వాతే

అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజాపరిషత్‌లలో కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలను ఇకమీదట అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాతే నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనల్లో ఈ మేరకు కీలక సవరణలు చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

కొత్త నిబంధనల ప్రకారమే మండల ప్రజాపరిషత్‌లలో కూడా ఎన్నిక నిర్వహిస్తారు. మండల ప్రజాపరిషత్‌ తొలి సమావేశానికి నిర్ణయించిన తేదీ నుంచి రెండు నెలల్లోగా ఈ ఎన్నికను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ

ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి హవా

Updated Date - Nov 20 , 2026 | 06:13 AM