వైసీపీ అరాచకాలపై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:33 AM
రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో వైసీపీ నేతలు, కార్యకర్తలు.. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని...
ఎన్నికల కమిషన్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు
అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో వైసీపీ నేతలు, కార్యకర్తలు.. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ వర్ల రామయ్య నేతృత్వంలో పర్చూరి అశోక్‌బాబు, ఎస్ రాజశేఖర్, నీలాయపాలెం విజయ్‌కుమార్‌తో కూడిన బృందం గురువారం ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. కడప, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ రౌడీమూకలు రెచ్చిపోతున్నాయని, విధ్వంసం, అరాచకాలు సృష్టిస్తున్నాయని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ