హైదరాబాద్‌లో రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. పలువురికి గాయాలు
ABN , Publish Date - Nov 20 , 2026 | 10:03 AM
హైదరాబాద్‌లో రెండు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మల్కాజిగిరి సఫిల్‌గూడలో బస్సును ఆటో ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద యాపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హైదరాబాద్, నవంబర్ 20: నగరంలోని మల్కాజిగిరి సఫిల్‌గూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. బస్సు, ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఆటో అదుపుతప్పి బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలవగా.. ఆటో డ్రైవర్‌కు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే సఫిల్‌గూడ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి పరిస్థితులను మెరుగుపరచాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
యాపిల్ పండ్ల ట్రాక్కు బోల్తా.. భారీగా ట్రాఫిక్ జామ్
ఇక అబ్దుల్లాపూర్ మెట్టు రామోజీ ఫిల్మ్‌సిటీ వద్ద యాపిల్ పండ్ల ట్రక్కు బోల్తా పడింది. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద జాతీయ రహదారిపై యాపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న భారీ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. లారీ బోల్తా పడటంతో అందులోని యాపిల్ పండ్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే స్పందించిన స్థానికులు.. డ్రైవర్‌కు సాయం అందించారు.
అయితే లారీ బోల్తాతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటిన ‘అక్వాన్’ తుపాను.. 90 కి.మీ. వేగంతో గాలులు
Read Latest Telangana News And Telugu News