‘ఇందిరమ్మ బీమా’ అమలుకు సన్నాహాలు
ABN , Publish Date - Nov 20 , 2026 | 09:42 AM
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను పక్కాగా అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
వార్డు ఇన్‌చార్జుల నియామకం చేపడుతున్న అధికారులు
రేషన్ కార్డు, ఆధార్, మొబైల్ నంబర్ ఉంటే రూ.5 లక్షల బీమా
వచ్చేనెల 18వ తేదీ వరకు పనిచేయనున్న ప్రత్యేక శిబిరాలు
హైదరాబాద్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను పక్కాగా అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆహార భద్రతా కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమాను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐకేజేబీపీని కూకట్‌పల్లి సర్కిల్‌లో పక్కాగా అమలు చేసేందుకు డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. సర్కిల్ పరిధిలో నివాసం ఉండే వారితో పాటు రాష్ట్రంలో ఎక్కడ రేషన్ కార్డు ఉన్నా 18-59 ఏళ్ల వరకు ఉన్న వ్యక్తులకు ఇక్కడ బీమా పేరు నమోదు కోసం వస్తే తిరస్కరించకుండా నమోదు చేసి రషీదు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కూకట్‌పల్లి సర్కిల్‌లో వేగం పెంచిన డీసీ.. మూసాపేట్ సర్కిల్‌లో మాత్రం నియామకంలో తర్జన భర్జనలో డీసీ.. గురువారం నుంచి పక్కా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రతి ఇంటికీ బీమా అందాలి అంటే పక్కా వివరాలతో కంప్యూటర్లలో ఎక్కించాలి.
ఆ మూడు వార్డుల్లో ఇక్కడే..
కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో వసంతగర్ వార్డు ప్రజలు కాలనీలోని లైబ్రరీ హాల్, కేపీహెచ్‌బీ వార్డు ప్రజలు రమ్యగ్రౌండ్ వద్ద ఉన్న వార్డు కార్యాలయం, కైతలాపూర్ వార్డు ప్రజలు మూసాపేట్‌లోని కూకట్‌పల్లి సర్కిల్ కార్యాలయంలో బీమా నమోదుకు ఏర్పాట్లు చేసినట్లు డీసీ పేర్కొన్నారు. మిగతా వార్డు ప్రజలు ఆయా వార్డు కార్యాలయాల్లో బీమా పొందవచ్చన్నారు.
మూసాపేట్ సర్కిల్‌లో స్పష్టత కరువు..
సీఎంసీ మూసాపేట్ సర్కిల్- 53లో ఐదు వార్డులు ఉన్నాయి. డీసీ శ్రీనివాసరెడ్డి కసరత్తు చేసినా ఎవరు ఎక్కడెక్కడ అనే దానిపై స్పష్టత రాలేదు. సర్కిల్ పరిధిలో బాలానగర్, ప్రశాంత్‌నగర్, మూసాపేట్, మోతీనగర్, అల్లాపూర్ వార్డులు ఉన్నాయి. కూకట్‌పల్లి సర్కిల్‌తో పోలిస్తే ఇక్కడ ఎక్కువ మంది బీపీఎల్ కుటుంబాలు నివాసిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలుకు సర్కిల్‌లో అధికారులు ఎంత సీరియ్‌సగా తీసుకుంటే అంత మందికి మేలు జరిగే అవకాశం ఉంది. గురువారం నాటికి క్షేత్రస్థాయిలో ఇన్‌చార్జులు, కంప్యూటర్ ఆపరేటర్లు, సీవోల నియామకం జరగాల్సి ఉంది.
సర్కిల్‌లో ప్రత్యేక అధికారులు, ఫోన్ నంబర్లు
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కూకట్‌పల్లి సర్కిల్-52లో ఆరు వార్డులు ఉన్నాయి. ప్రతీ వార్డుకు ఒక ఇన్‌చార్జి, ఆపరేటర్, వారి ఫోన్ నంబర్లతో సహా డీసీ ఆంజనేయులు గురువారం మీడియాకు విడుదల చేశారు. అన్ని పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో పేర్లు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
కూకట్‌పల్లి వార్డు-249 ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఎం.కిరణ్-9177701920, కంప్యూటర్ ఆపరేటర్ శిరీష-9014015134, సీవో కె.ప్రవీణ్‌కుమార్-98499506161.
బాలాజీనగర్ వార్డు-250 ఇన్‌చార్జి టాక్స్‌ఇన్‌స్పెక్టర్ 9989930272, కంప్యూటర్ ఆపరేటర్ నళిని-8897416590, సీవో కె.ప్రవీణ్‌కుమార్-98499506161.
వసంతనగర్ వార్డు-251 ఇన్‌చార్జి ట్యాక్స్‌ఇన్స్‌పెక్టర్ బి.యాదగిరి 9493229104, కంప్యూటర్ ఆపరేటర్ జయశ్రీ-8688097311, సీవో కె.ప్రవీణ్‌కుమార్-98499506161.
కేపీహెచ్‌బీ కాలనీ వార్డు-252 ఇన్‌చార్జి ఏఎంసీ కె.శ్రీనివాస్-9989930181, కంప్యూటర్ ఆపరేటర్ శిల్ప-8501064597, సీవో కె.ప్రవీణ్‌కుమార్-98499506161.
కైతలాపూర్ వార్డు-253 ఇన్‌చార్జి సూపరింటెండెంట్ శ్రీలత-8106530234, కంప్యూటర్ ఆపరేటర్ అనిత-7842865453, సీవో సి.ఇందిరా- 9949137772.
గాయత్రీనగర్ వార్డు-254 ఇన్‌ఛార్జి ఏఎంసీ పద్మభూషణ్‌రాజ్-9959552095, కంప్యూటర్ ఆపరేటర్ శ్యామ్-9502300281, సీవో సి.ఇందిరా- 9949137772.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
Read Latest AP News And Telangana News And International News And Telugu News